- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విప్లవం ముగియదు.. రూపం మారుతుంది!
మానవ చరిత్రలో ప్రతి కాలం ఒక నిర్దిష్ట సమయంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం కోసం ఉధృతమైన సామాజిక కదలికలను చూస్తుంది. ఆ కదలికలనే విప్లవో ద్యమాలు అంటారు. ఇవే సమాజాన్ని మార్చే ప్రాధమిక శక్తిగా నిలిచాయి. కానీ ప్రశ్న ఏమిటంటే..

మానవ చరిత్రలో ప్రతి కాలం ఒక నిర్దిష్ట సమయంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం కోసం ఉధృతమైన సామాజిక కదలికలను చూస్తుంది. ఆ కదలికలనే విప్లవో ద్యమాలు అంటారు. ఇవే సమాజాన్ని మార్చే ప్రాధమిక శక్తిగా నిలిచాయి. కానీ ప్రశ్న ఏమిటంటే.. ఈ విప్లవోద్యమాలు ఎప్పటికైనా అంతమవుతాయా? విప్లవోద్యమం ఒక నిరసన మాత్రమే కాదు. అది ప్రజల చైతన్యానికి ప్రతి రూపం. ప్రభుత్వం, వ్యవస్థ ప్రజల అవ సరాలు తీర్చలేక పోయినప్పుడు విప్లవ భావన పుడుతుంది. ఫ్రెంచ్ విప్లవం రాజకీయ హక్కుల కోసం, రష్యా విప్లవం సామాజిక న్యాయానికి, భారత స్వాతంత్ర్య సమరం జాతీయ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉదాహరణలే. ఇవన్నీ చూపిం చే అంశం ఏమిటంటే విప్లవం అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు. అది నిరంతరంగా పునరావృత మవుతున్న చరిత్ర. మన సమాజం స్థిరంగా ఉండదు. ప్రతి తరంలో కొత్త సమస్యలు, కొత్త వివక్షలు, కొత్త ఆకాంక్షలు రూపుదిద్దుకుంటాయి. కాబట్టి పాత విప్లవాలు ముగిశాక కూడా, కొత్త విప్లవోద్యమాలు అవే విలువల కొత్త రూపాలు అవుతాయి. ఉదాహరణకు గతంలో సాయుధ పోరాటం రూపంలో ఉన్న ఉద్యమాలు, నేడు పర్యావరణ పరిరక్షణ, మహిళా హక్కులు, విద్యా న్యాయం, రైతు సంక్షేమం, వంటి అంశాలపైన శాంతియుత ప్రజా కదలికలుగా మారాయి. ఇది విప్లవ భావం రూపాంతరం చెందినదని నిర్ధారిస్తుం ది. ఇంకా డిజిటల్ యుగంలో విప్లవం కొత్త అర్థం పొందింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఉద్య మాలు, ప్రజాస్వామ్య చర్చా వేదికలు ఆత్మీయత, ప్రతిఘటనకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఒక ట్వీట్ లేదా వీడియో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల చైత న్యాన్ని ప్రేరేపించగలదు. ఇది ఆధునిక విప్లవ రూపం హింసా రహితమైన, కానీ ఆలోచనాత్మకంగా శక్తివంతమైనది. అయితే, ఒక ఉత్తమమైన సమాజం ఏర్పడినప్పుడు విప్లవం అవసరమే ఉండదు. కానీ చరిత్ర చెబుతున్నది ఏమిటంటే, ఏ సమాజం కూడా సంపూర్ణ పరిపూర్ణత సాధించదు. అన్యాయం, అవినీతి, అసమానతలు ఎప్పుడో ఒకప్పుడు కొత్త రూపాల్లో తిరిగి మానవ సమాజం లో ప్రత్యక్షమవుతాయి. కాబట్టి, విప్లవోద్యమాలు అంతం కావు.
- సీపతి వినయ్ ,
83746 88740






