ఉచిత విద్య వాగ్దానం.. బకాయిల బారిన పేద విద్యార్థులు..

by Ravi |   (  Updated:2025-10-11 00:30:48  IST  )

పేదలకు కార్పొరేట్‌ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభు త్వం ప్రారంభించిన బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం. ఈ పథకంలో 1 నుంచి పదో తరగతి రెసిడెన్షియల్‌ విధానంలో బోధనకు కోట్ల రూపాయలు

ఉచిత విద్య వాగ్దానం.. బకాయిల బారిన పేద విద్యార్థులు..
X

పేదలకు కార్పొరేట్‌ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభు త్వం ప్రారంభించిన బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం. ఈ పథకంలో 1 నుంచి పదో తరగతి రెసిడెన్షియల్‌ విధానంలో బోధనకు కోట్ల రూపాయలు ప్రభుత్వం పాఠశాలలకు చెల్లిస్తుంది. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏటా ఒకటి, ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు లాటరీ పద్ధతిలో పిల్లలను ఎంపిక చేస్తారు. దీని ప్రకారం ఈ విద్యాసంవత్సరం కూడా వారిని ఎంపిక చేశారు. అయితే బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకంలో భాగంగా చదువుతున్న పేద విద్యార్థుల చదువులకు ఫీజు బకాయిలు అడ్డుపడుతున్నాయి. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సుమారు 25 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా 237 ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అయితే గత రెండేళ్లుగా సర్కారు నుంచి బకాయిలు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. ఫీజులు కట్టమని విద్యార్థులపై ఒత్తిడి తె‌స్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా చదువులు చెప్పలేమంటూ బడికి రానివ్వని పరిస్థితులున్నాయి. దీంతో పదో తరగతి పిల్లలపై అధిక ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ఈ నిధులు తొందరగా విడుదల చేయకపోతే పేద విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉం ది. అందుకే ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు వారి చదువులు నిరాటంకంగా కొనసాగించడానికి ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే పూనుకొని మిగిలి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేసి తమ పిల్లలకు విద్య ఆటంకం లేకుండా కొనసాగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-ఈదునూరి వెంకటేశ్వర్లు

99663 36457

Next Story