త్యాగాలకు ఫలమేది?

by Ravi |   (  Updated:2024-01-26 00:30:48  IST  )

Poem on Republic Day 2024

త్యాగాలకు ఫలమేది?
X

ఓటుకే రేటు పుడుతుందంటే..

ఉరికొయ్యల్ని ముద్దాడేవారా!

అబలల్ని బలికొంటమే స్వేచ్ఛ అంటే..

మానాభిమానాల్ని బలిచ్చేవారా!

కులానికే గులాములంటే..

మతానికే మతి తప్పుతారంటే..

కులమతాలు వదిలి కదిలే వారా!

అవినీతే అసలు నీతి అంటే..

సర్వస్వాల్ని త్యజించి పోరాడే వారా!

పేదోడికే న్యాయం ఎండమావంటే..

తెల్లోడి అన్యాయాన్ని ఎదిరించే వారా!

రాజకీయ బేరసారాలు

ఎన్నికల ఎత్తుగడలు

పదవుల పంపకాలు

విషవలయంలో..

మళ్లీ బానిస బతుకులేనంటే!

మువ్వన్నెల జెండా గెలుపు కోసం

సామ్రాజ్యవాదుల కరుకు చేతుల్లో

వినడానికే వణుకు పుట్టే మరణాలతో

అమరులయ్యేవారా, వాళ్లంతా..!

( నేడే గణతంత్ర దినోత్సవం )

- భీమవరపు పురుషోత్తమ్

9949800253

Next Story