- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
ఇది ప్రకృతి సొగసుల పర్వం
హోలీ ఇది వసంత కేళి
హోలీ రంగుల చెమకేళి
రంగురంగుల పువ్వుల నవ్వులు
నవ వసంత సుగంధాలు
ఏకాంత ప్రకృతి
ఎప్పుడూ ఏదో వికాస ఆకృతి
ఫాల్గుణ పౌర్ణమి కామదహనం
మన్మథుణ్ని మూడో కన్నే
దహనం చేసె నాడు!
కామాంధులను కాల్చ
ఎన్ని క(గ)న్నులు కావాలి నేడు!
గుండెలో ఉత్సాహం నిండాలి
ఊరంతా ఉత్సాహంగా ఆడాలి
మదనోత్సవములో మునిగే
ప్రకృతి పులకింతల కేళి
రంగులలో తడిసి
జనావళి ఒక్కటవ్వాలి!
హోలీ ఆనందంగా జరగాలి
పి.బక్కారెడ్డి
97053 15250
- Tags
- poem on holi
Next Story






