- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
గోగువనం పువ్వులు
గోరువంక నవ్వులు
గోదారి గట్టుమీద -
ఆడేటి గువ్వలు...
మోగేటి మువ్వలు
ఆడే గోగు
తంగేడు పూబంతులు
రంగరించె వింతలు
కిలకిలల కేకలతో -
చిలకరించే కాంతలు...
చిందేసే ఇంతులు
చిల గోగు
పసుపు కొమ్ము దంచిరి
పాయసమ్ము గాచిరి
వరసైన వారి తోటి -
కోలాటమాటలాడిరి...
కోరి కోరి పూచిరి
కోల గోగు
కుంకుమ పువ్వు దెచ్చిరి
కుడుక బెల్లం బెట్టిరి
రంగు నీటి వానలో -
హోలీ రంగు జల్లిరి...
హొయలు తాము పోయిరి
హోలీ గోగు
గంగాపురం శ్రీనివాస్
96763 05949
- Tags
- holi
- poem on holi
Next Story






