వట్టి అమాయకులం

by Ravi |   (  Updated:2026-01-21 00:15:40  IST  )

Poem

వట్టి అమాయకులం
X

వట్టి అమాయకులం

లోకం పోకడ తెలియని స్నేహితులం

మేమే జడ్పీహెచ్ఎస్ వారసులం

టీచర్స్ మాట జవదాటం

మనల్ని తిడితే మూతి

ముడుచుకుని కూర్చుంటం

పక్కనున్నోళ్లను తిడితే

పగలబడి నవ్వుతాం

మేమే వట్టి అమాయకులం

శాయంపేట నడి ఒడ్డున ఉన్న స్కూల్‌కి

నాలుగు ఊర్ల నుండి వస్తాం

మమ్మల్ని చూస్తే ఏదో

కాన్వెంట్‌లో చదివినట్లు ఉంటాం

అలగ ఊర్లనుంచి వచ్చి

హాస్టల్‌లో కలుస్తాం

భుజాన సంచివేసి బాటసారిగా

బడికి బయలుదేరుతాం

మాసిన డ్రెస్ అయినా సరే..

కచ్చితంగా స్కూల్ డ్రెస్‌లోనే వెళ్తాం

మేమే వట్టి అమాయకులం

నుదిటిన చిన్న బొట్టు..

రెండు జుట్లు బిర్రుగా పైకి కట్టు

చెప్పులు లేకుండా బడికి వెళ్తే ఒట్టు

కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు పెట్టు

ఆడకపోతే పీటీ ఒళ్లు పగులగొట్టు

నర్మద బాయి టీచర్ ఓపికను పరీక్షిస్తాం

ఊర్మిళ టీచర్ ఉయ్యాల పాటలో

హాయిగా నిద్రపోతాం

సంధ్యారాణి టీచర్ వస్తే కన్ను

మన పైన పడకుండా జాగ్రత్త పడుతాం

సుధావాణి టీచర్ చాక్ పీస్ రాసుకుంటే

బెంచ్ కిందకి వంగి నవ్వుతాం

మేమే వట్టి అమాయకులం

- తడుక కళ్యాణి,

81067 78062

Next Story