- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఏడు దశాబ్దాలుగా
ఎర్రజెండా నీడన
పోరాడమంటే
ఓటు రాజకీయలే
శాసనసభ, పార్లమెంటు మోజులో
జల్లెడ పట్టుకొని ఓట్లు
మూటగట్టుకోవాలని
కంకి కొడవలేకాదు
సుత్తి కొడవలి కూడా
పోటీ పడుతున్నాయి !
ఎడారిలో ఒయాసిస్సు
మత్తడి పోస్తుందన్నంత నమ్మకంగా
ప్రజల సకల సమస్యల నొప్పులకు
పార్లమెంటు అసెంబ్లీలే
సరైన అపాయింట్‌మెంటని
ఎన్నికల కలుగుల్లోకి
కమ్యూనిస్టులు
పరుగో పరుగు
బ్రిటీష్ సెంట్రల్ మన
అసెంబ్లీ వారసత్వమే
ఎన్నికల్లో అడుగులకు
మడుగుల్లో పొర్లి
అధికారానికి ఎత్తుల పొత్తులతో
మూటగట్టుకోవాలన్నదే వీళ్ళ ఆశ
శోభరమేష్
89786 56327
- Tags
- poem
Next Story






