- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆలోచించు..
ప్రాణాలు ఎవరివి పోయెనో
పదవులు ఎవరికి దక్కెనో
ఆత్మగౌరవం అంగట్లో కలిసినా
అవినీతి రాజ్యమేలేనా,
గడ్డి పోచలన్నీ కలిసి తాడుని పేనుకుని
మదపుటేనుగును బంధించినట్లు,
ఆలోచించు..!
చలి చీమలన్నీ కలిసి
విష సర్పం పని పట్టినట్లు,
దారపు పోగులన్నీ ఒక్కటై
ఉరి రాళ్ళను పేనుతున్నట్లు,
లేగ దూడలన్నీ ఒక్కటై
సింగాలను తరిమినట్టు,
బానిసలంతా ఒక్కటై
యజమాని భరతం పట్టినట్టు
ఆలోచించు..!
కూలీలంతా ఒక్కటై
దొరల గడిని కూల్చినట్లు,
యూనివర్సిటీలన్నీ కలిసి
ఉక్కు పిడికిలి ఎత్తాలి
నయా దొరల భరతం పట్టాలి
పల్లె సతీష్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
- Tags
- poem
Next Story






