రిటైర్మెంట్ బకాయిలకు వడ్డీ చెల్లించండి!

by Ravi |   (  Updated:2026-07-16 00:30:24  IST  )

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపుల్లో జాప్యం, హైకోర్టు ఆదేశాలు, డి.ఎస్. నకారా తీర్పు ప్రాధాన్యం, 10 శాతం వడ్డీతో బకాయిల చెల్లింపుపై రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్‌..

రిటైర్మెంట్ బకాయిలకు వడ్డీ చెల్లించండి!
X

‘పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’ అని 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తీర్పు ప్రకారం మార్చి 2024 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లు గడిచినా పూర్తిగా అందడం లేదని పలువురు తెలంగాణ హైకో ర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభు త్వం ప్రారంభంలో కొంతమందికి బకాయిలు చెల్లించినా, తర్వాత తీర్పులను పూర్తిగా అమలు చేయలేదు. దీంతో మరోసారి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు 10 శాతం వడ్డీతో బకాయిలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అయినప్పటికీ, కొందరికి మాత్రమే పూర్తి చెల్లింపులు జరిగాయి. మరికొందరికి పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించినట్లు చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరికి వడ్డీ కూడా చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2024 నుంచి జూన్ 2026 వరకు దాదాపు 26 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. పెన్షనర్ సంఘాల ఉద్యమాల నేపథ్యంలో రూ.6,000 కోట్లు విడుదల చేసి, కమ్యూటేషన్, జీపీఎఫ్ బకాయిలు సెప్టెంబర్ 2025 వరకు చెల్లించామని ప్రభుత్వం ప్రకటించినా, ఎస్‌టీఓలో బిల్లులు సమర్పించిన పలువురికి ఇప్పటికీ కమ్యూటేషన్, జీపీఎఫ్ అందలేదని చెబుతున్నారు. కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం అత్యవసరంగా నిధులు కావాలని వినతులు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఉద్యో గు లు తీసుకున్న గృహ, వ్యక్తిగత రుణాలపై 9 నుంచి 13 శాతం వరకు, ప్రైవేటు అప్పులపై అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితిలో, హైకోర్టు ఆదేశాల మేరకు 10 శాతం వడ్డీతో పాటు అన్ని రిటైర్మెంట్ బకాయిలను దశలవారీగా కాకుండా ఈ జూలై నెలలోనే ఒకేసారి చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

- కందుకూరి దేవదాసు

9949937745

Next Story