రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. వారికి ఒక్కొక్కరికి రూ.25వేలు !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. వారికి ఒక్కొక్కరికి రూ.25వేలు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన నేతన్నకు భరోసా స్కీం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది సర్కార్. ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభించింది చేనేత, జౌళి శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55,000 మంది అర్హులు ఉంటారని... వారందరికీ ఏడాదికి రూ.25 వేల చొప్పున నేతన్నకు భరోసా పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద రూ.24000 ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మరో వెయ్యి అదనంగా కార్మికులకు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కూడా కేటాయించింది సర్కార్.

నేతన్నకు భరోసా పథకానికి ఎవరు అర్హులు ?

సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు నేతన్నకు భరోసా పథకం వర్తించనుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాట్నం వడకడం, రంగులు అద్దడం లాంటి కార్మికులకు కూడా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు పదివేల మంది ఉంటారని ఓ అంచనాకు కూడా వచ్చింది సర్కార్.

Next Story