నేడు రెండో వన్డే.. మళ్ళీ మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు

by velandi.Saikiran |

ఇంగ్లాండ్, భార‌త జ‌ట్ల మ‌ధ్య నేడు రెండో వన్డే జ‌రుగ‌నుంది.

నేడు రెండో వన్డే.. మళ్ళీ మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. కార్డీఫ్‌ వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. అయితే మొన్న జరిగిన మొదటి వన్డే మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. అయితే ఇవాళ జరిగే రెండో వన్డే టైమింగ్స్ లో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐదు గంటలకు టాస్ వేస్తారు. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. అటు మొన్న గాయపడ్డ గిల్ కోలుకుని.. నేటి మ్యాచ్ కు సిద్ధమయ్యాడు. ఇవాళ భారత జట్టు గెలిస్తే, వన్డే సిరీస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే... మూడో వన్డే దాకా ఆగాల్సి ఉంటుంది.

భార‌త జ‌ట్టు ప్రాబబుల్ XI: శుభమన్ గిల్ (c), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (WK), అక్షర్ పటేల్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, గురునూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Next Story