- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో పాల్గొని.. దేశాభివృద్ధికి తోడ్పడండి!
దేశ అభివృద్ధి, సమర్థవంతమైన పాలనకు జనగణన ఎందుకు కీలకం? జనాభా, విద్య, ఉపాధి, వనరుల పంపిణీ, నియోజకవర్గాల పునర్విభజనలో జనగణన పాత్రపై విశ్లేషణాత్మక కథనం.

జనగణన దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తుంది. సరైన సమాచారం లేకుండా సమర్థవంతమైన పాలన సాధ్యం కాదు. ఈ అవసరాన్ని తీర్చే ప్రధాన ప్రక్రియే జనగణన. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహా గణాంక సర్వే ద్వారా దేశ జనాభా సంఖ్యతో పాటు విద్య, ఉపాధి, నివాస పరిస్థితులు, వలసలు, భాషలు, మతాలు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుంది. ఈ డేటా ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాయి. అలాగే ఏ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంది, ఎక్కడ విద్య, వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. దాని ప్రకారం నిధుల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుంది. అలాగే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా జనగణన కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభాతో వనరులపై ఒత్తిడి, నిరుద్యోగం, నగరీకరణ సమస్యలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో కుల గణనపై కూడా చర్చ జరుగుతోంది, ఇది సమర్థవంతమైన పాలనకు మరింత ఖచ్చితమైన డేటాను అందించగలదు. ఇకపై డిజిటల్ విధానంలో జనగణన చేపట్టడం ద్వారా వేగం, ఖచ్చి తత్వం పెరుగుతుంది. మొత్తానికి, జనగణన కేవలం సంఖ్యల లెక్క కాదు. అది దేశ భవిష్యత్తును నిర్ణయించే శాస్త్రీయ ప్రక్రియ. సరైన పాలన, సమగ్ర అభివృద్ధి దీనిపైనే ఆధారపడి ఉంది. అందువల్ల ప్రతి పౌరుడు ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో పూర్తిగా పాల్గొని సరైన, నిజమైన సమాచారం అందించాలి. ఇది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అనే భావనతో ముందుకు రావాలి.
-ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్
94402 87170






