- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ భారత్‌తో స్నేహం కాంక్షించాలి..
ఆపరేషన్ సిందూర్‌తో కకావికలం అయిన పాక్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ దేశ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

ఆపరేషన్ సిందూర్‌తో కకావికలం అయిన పాక్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ దేశ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తాజాగా ఆ దేశ ఆర్మీ అధికారి చేసిన వ్యాఖ్యలు అతని స్థాయిని పెంచేవిగా లేవు.. అసలే నీళ్ళు లేక అల్లాడుతున్న దేశం ఇలా వితండవాదం చేస్తే ఎలా? మొత్తానికి పాక్, ఆపరేషన్ సిందూర్ ద్వారా చాలా వరకు నష్టపోయింది. ప్రస్తుతం పాక్ ఎయిర్ బేస్ భారీగా నష్టపోయింది. వాటి పునరుద్దరణకు భారీ వ్యయం అవసరం. ఇటీవలే ఐఎంఎఫ్ రుణం మంజూరు అయినా భారత్ కొన్ని షరతులు పెట్టింది. ఇది పాక్‌కి పెద్ద దెబ్బ. షరతులకు పాక్ అంగీకరించాలి. ఉగ్రవాదంకు మద్దతు ఇవ్వం, ఉగ్రవాద నిర్ములనకు భారత్‌తో కలసి పని చేస్తామని చెప్పాలి. భారత్‌తో పని చేయడానికి పాక్‌కు నామోషీ, అందుకే చైనా పంచన చేరింది. ఒకవైపు అమెరికా ఉగ్రచర్యలు ఎక్కడా సహించమని చెబుతున్న పాక్‌కు జ్ఞానోదయం కాలేదు. సింధూ నదిలో రక్తం పారుతుంది అని పాక్ నాయకులు మొండిగా చెబితే, భారత్ రేపు చేసే దాడి పాక్ ఊహకు అందదు. కనుక పాక్ నాయకులు, ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్, బిలవల్ భుట్టో ఆచితూచి మాట్లాడితే మంచిది. పాక్ లక్ష్యం ఒక్కటే భారత్‌ను అస్థిరపరచాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవాలని, అది చేసే ట్రిక్కులు ఎన్నో.. అయిన భారత్ స్థిరంగా ఉంటుంది. పాక్ మాదిరి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొదు. భారత్ బలం ముందు పాక్ ఎప్పటికి బలాదూర్.. సుస్థిర శాంతి, ఆర్థిక ప్రగతి, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, అన్నింటికన్నా దేశ పౌరుల క్రమశిక్షణ, దేశాల మధ్య సఖ్యత, ఇతర దేశాలకు చేతనైన సహాయ, సహకారాలు అందిం చటం భారత్ విదేశాంగ లక్షణాలు.. వీటికే భారత్ ప్రాముఖ్యత ఇస్తుంది ఉగ్రవాదానికి కాదు. పాక్, భారత్‌తో స్నేహం కాంక్షించాలి అంతే కానీ యుద్ధం కాదు. త్వరలోనే భారత్, పాక్ మధ్య మంచి చర్యలు ఉంటాయని ఆశిద్దాం.
-కనుమ ఎల్లారెడ్డి
93915 23027






