- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒంటరి
పాకిస్తాన్‌పై నేడు భారత్ చేస్తున్న న్యాయ మైన యుద్ధానికి ప్రపంచంలో అనేక దేశాలు భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి.

పాకిస్తాన్‌పై నేడు భారత్ చేస్తున్న న్యాయ మైన యుద్ధానికి ప్రపంచంలో అనేక దేశాలు భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. భారత దేశం మొదటి నుండి ఏ సైనిక కూటమిలోనూ ఉండకుండా అలీన విధానాన్నే అనుసరించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా యుద్ధాన్ని ఆపడానికి ఇద్దరితో సమా నంగా మాట్లాడింది. తన తోటి ప్రపంచ ప్రధాన శక్తులతో సన్నిహిత, వ్యూహాత్మక, సైనిక సంబంధాలు కలిగి ఉంది. భారత దేశానికి అత్యంత సన్నిహితంగా పరిగణింపబడే దేశాలలో రష్యన్ ఫెడరేషన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, యునై టెడ్ స్టేట్స్ ఉన్నాయి. వీటిలో రష్యా, యూఎస్ఏ లాంటి శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా పహెల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మరణ కాండను ముక్తకంఠంతో ఖండించాయి. మన శత్రువైన చైనా, పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్మే టర్కీ మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతునిస్తున్నాయి. కొన్ని అరబ్, ముస్లిం దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత్‌కే అవి మద్దతునిచ్చాయి. పాకిస్తాన్ ఒంటరయిపోయింది. యునైటెడ్ కింగ్‌డం, జపాన్, సింగపూర్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇటలీ లాంటి దేశాలతో భారత దేశం బలమైన' సైనిక' సంబంధాలు కలిగి ఉండటం వలన భారత్ కు మద్దతు పలుకుతున్నాయి. భారతదేశం అతిపెద్ద సైనిక, వ్యూహాత్మక భాగస్వామిగా ఇజ్రాయెల్ ప్రస్తుతం రష్యాను అధిగమించింది. ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని ఖండించటమే గాక 'భారత్ పై అడుగువేస్తే తాము సైనిక దానికి కూడా వెనుకాడబోమని' హెచ్చరించింది.
శరత్
63001 81535






