- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం విదిల్చేది కొంతే..!
తెలంగాణ గ్రామాల్లో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు ‘ఇందిరమ్మ ఇండ్లు’ అని పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలు,

తెలంగాణ గ్రామాల్లో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు ‘ఇందిరమ్మ ఇండ్లు’ అని పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, తీవ్రంగా తప్పుబడుతున్నారు. "డబ్బులిస్తున్నది మోడీ సర్కారైతే, పేరు ఇందిరమ్మది ఎలా?" అంటూ మండిపడుతున్నారు. ఆయన వాదన విన్న వారికీ అది నిజమే కదా అనిపించొచ్చు. కానీ లెక్కలు చూస్తే, అసలు కథ వేరే ఉంది! వాస్తవానికి కేవలం కేంద్రం ఇస్తున్న నిధులతో పేదలకు ఇంటి నిర్మాణం పూర్తవడం లేదు. ఇల్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంటే, కేంద్రం వాటాగా వస్తున్న డబ్బులు... తలుపులు, కిటికీల వరకూ మాత్రమే సరిపోతున్నాయి. ఉదాహరణకు, గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లో ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి రూ. 8 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువే ఖర్చు చేసింది. అందులో కేంద్రం వాటాగా గ్రామీణ ప్రాంతాలకు కేవలం రూ.73,000, పట్టణ ప్రాంతాలకు లక్షన్నర మాత్రమే వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఈ చిన్న మొత్తం ఇంటి నిర్మాణానికి ఏ కోశానా సరిపోదు. అందుకే మిగతా మొత్తం రాష్ట్రమే భరించింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తోంది.
ఇలా ఏ రాష్ట్రంలో చూసినా కేంద్రం ఇస్తున్న మొత్తం ఇంతే ఉంటోంది. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే కథ వినిపిస్తోంది. కేంద్రం ఇచ్చే కొసరు మొత్తానికి గాలిలో ఎగిరి మరీ చప్పట్లు కొట్టుకోవడం బీజేపీ నేతలకే సాధ్యం! ఇంటిని నిర్మించేది రాష్ట్ర ప్రభుత్వం, కిటికీ, తలుపుల కట్టించేది మాత్రం కేంద్రం. సరే, అయితే ఇంటిపై "ఇందిరమ్మ ఇండ్లు" అని రాస్తే, తలుపుల మీద "మోడీ తలుపు", కిటికీ మీద "మోడీ కిటికీ" అని రాసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. లొల్లిలేదు, పంచాయితీ లేదు!
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం
80088 88834






