ఒక ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు!

by Ravi |   (  Updated:2025-09-25 00:30:25  IST  )

గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మన గ్రామా భివృద్ధికి పునాది వేసే ముఖ్యమైన ఘట్టం. త్వరలో తెలంగాణాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న

ఒక ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు!
X

గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మన గ్రామా భివృద్ధికి పునాది వేసే ముఖ్యమైన ఘట్టం. త్వరలో తెలంగాణాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో మనమంతా బాధ్యతగా ఓటు వేయడం ఎంత అవసరమో, అదే సమయంలో ప్రలోభాలకు లొంగకుండా ఉండటం అంతే ముఖ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో, మన ఓటు ఒక సంఖ్య కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే ఒక శక్తివంతమైన ఆయుధం. ఓటు వేయడం మన ముఖ్యమైన బాధ్యత. మన ఓటు ద్వారా గ్రామ పంచాయతీకి సరైన నాయకుడిని ఎన్నుకొని మన గ్రామ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రూపంలో ప్రలోభాలు రావడం సర్వసాధారణం. అయితే, ఈ ప్రలోభాలకు లొంగితే.. మనం మన ఓటును అమ్ముకున్నట్టే. ఒకసారి ఓటును అమ్ముకుంటే, ఐదేళ్ల పాటు మన గ్రామం యొక్క అభివృద్ధిని ఆ నాయకుడి దయాదాక్షిణ్యాలపై వదిలేసినట్టే.. కాబట్టి మన ఓటు విలువను అర్థం చేసుకుని డబ్బు కన్నా మన గ్రామ అభివృద్ధి ముఖ్యమని గుర్తించాలి. యువత తాము నిజాయితీగా ఓటు వేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ఈ కీలకమైన ఎన్నికల ప్రక్రియలో యువత, మహిళలు కీలక పాత్ర పోషించాలి. యువత సోషల్ మీడియాను ఉపయోగించి గ్రామ ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రలోభాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి. మహిళా సంఘాల సభ్యులు ఐక్యతగా ఉండి ప్రలోభాలను ఇచ్చే వారిని నిర్భయంగా ప్రశ్నించి, తిరస్కరించాలి. ఇది రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకువస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం రాజకీయ నాయకులను ఎన్ను కునే ప్రక్రియ కాదు, ఇది మనందరి భాగ స్వామ్యంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక మహత్తర అవకాశం. మన ఓటుతో, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం.

-తండు నాగరాజు

95055 50252

Next Story