ఆకాశంలో సగం.. కానీ అవకాశం అప్పుడే ఇవ్వం!

by Ravi |   (  Updated:2026-04-19 00:30:20  IST  )

మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం, డీలిమిటేషన్ వివాదం, ప్రతిపక్షాల వ్యతిరేకత వంటి అంశాలపై విశ్లేషణ

ఆకాశంలో సగం.. కానీ అవకాశం అప్పుడే ఇవ్వం!
X

మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా పార్లమెంట్ గుమ్మం ఎక్కీ దిగీ చివరకు 2024లో ఆమోదం పొందింది. అయితే ఆ చట్టం ప్రకారం 2034 లోపు సీట్ల కేటాయింపులు జరపడం కష్టం కాబట్టి, దాన్ని సవరిస్తూ 2029 ఎన్నికల నుండే అమలు చేసేలా సవరణ చేసుకుందామని ప్రభుత్వం కోరింది. ఇందులో అధికార పక్షం తాలూకా రాజకీయముంది. ఆ కోరికను మన్నించకపోవడంలో ప్రతిపక్షం తాలూకా రాజకీయముంది. వెరసి ఒక గంభీరమైన, ప్రగతిశీల సామాజిక అంశం తేలిగ్గా త్వరితంగా అమల్లోకి రాలేక, రాజకీయ జంజాటంలో చిక్కుకుంది. 2024 లో చట్టం చేసినప్పుడు అది వెంటనే అమలవుతుందని అనకుండా వచ్చే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమల్లోకి వస్తుంది అని అఖిల పక్షాలూ ఒప్పుకున్నాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా అమలుని ముందుకు జరుపుదామని, అందుకు అడ్డంకిగా ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియని ఇప్పటికే చేతిలో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ముందే కానిచేద్దామని బీజేపీ చూస్తే ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా ఇంతలోనే మీ హడావిడి ఏమిటి? మహిళా బిల్లుని కాదన్నామా, డీలిమిటేషన్ ఊసు లేకుండా అయితే ఒప్పుకుంటామని వ్యతిరేకంగా ఓటేశారు.. దీంతో బిల్లు వీగిపోయింది. ప్రస్తుత బిల్లులో ఒకే తీరున దక్షిణాదికి ఉత్తరాదికి 50% సీట్ల పెంపు అమలుచేస్తే సమానత్వం వస్తుందా? 100 సీట్లు ఉన్నవాడికి 150 అవుతాయి, 10 ఉన్నవాడికి 15 అవుతాయి.. ఇదెక్కడి న్యాయం! అందుకే ప్రతిపక్షాలు ఈ బిల్లుని వీగిపోయేలా చేశాయి. నిజానికి పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చట్టంతో పని లేకుండా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచవచ్చు..

-డా.డి.వి.జి.శంకరరావు,

94408 36931

Next Story