- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెత్తురు చిందించి.. సర్కారును వంచి..
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఉద్యమం, ప్రభుత్వ స్పందన, ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల ప్రాధాన్యం, యువత పాత్ర, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత అవసరం..

న్యాయం కోసం గొంతెత్తిన యువశక్తి ముందు ఎంతటి ప్రభుత్వమైనా తలవంచక తప్పదని ఢిల్లీ కేంద్రంగా సాగిన నీట్ పేపర్ లీకేజీ ఉద్యమం మరోసారి నిరూపించింది. కేవలం ఒక ప్రశ్నపత్రం లీక్ అవ్వడం వల్ల మాత్రమే కాకుండా, గత పదేళ్లుగా నిరుద్యోగం, ఆర్థిక విధానాల పట్ల యువతలో పేరుకుపోయిన ఆక్రోశం ఈ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా మారింది. నిరసనకారులపై పోలీసులు సాగించిన విచక్షణారహిత హింస, విద్యార్థులను 'దేశద్రోహులు'గా చిత్రీకరించేం దుకు జరిగిన కుట్రలు ఏవీ యువత పట్టుదలను సడలించలేకపోయాయి. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు విద్యార్థుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నీట్ పేపర్ లీకేజికి నిరసనగా ఢిల్లీలో సాగుతున్న ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ప్రధాన వార్త అయింది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో కోట్లాది మంది పౌరులు అటు విద్యార్థుల కదలికలను, ఇటు ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారు. న్యాయం కోసం గొంతెత్తిన యువతను కర్కశంగా పోలీసు ఉక్కుపాదంతో అణచి వేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. అయితే అదరని, బెదరని వారి సంకల్పం ముందు ప్రభుత్వం తలవంచక తప్పలేదు.. ఎట్టకేలకు ఇరువర్గాల మధ్య చర్చలు మొదలై యువత ప్రభుత్వం ముందించిన డిమాండ్లను నేరవేర్చింది.
నీట్ పేపర్ లీకేజ్ ఒక్కటే కారణం కాదు..
ఈ యువ రక్తపు సలసలలు నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతోనే ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిశాయని అనుకోలేం. 2014లో ఎన్నికల ముందు స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని తెచ్చి తలా లక్ష యాభై వేలు పంచుతామన్న బూటకపు మాటతో మొదలైన ప్రధాని మోడీ పాలన పెద్ద నోట్ల రద్దు, ప్రయివేటీ కరణ, నిరుద్యోగం, ఓట్ల తొలగింపు తదితర బీజేపీకి, వ్యాపార వేత్తలకు అనుకూల విధానాల పట్టాలపై నడుస్తోంది. తానో ప్రపంచ స్థాయి రాజకీయనాయకుడిగా గుర్తింపు పొందాలనే వ్యక్తిగత కాంక్షతో దేశ దేశాలు తిరుగుతూ మోడీ దేశ పాలనపై నిరాసక్తి ప్రదర్శిస్తున్నారు.. ఇలా పదేళ్లుగా గల్లంతైన ఆశల వల్ల యువతలో పెరిగిన నిరాశా నిస్పృహ జ్వాలలు పెల్లుబుకేందుకు ఈ లీకేజి ఇంధనమైంది. యువత నిరసనను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించవలసిన ప్రభుత్వం ప్రతిష్టకు పోయి దమనకాండకు పాల్పడింది. పోలీసులకు తోడు భద్రతా దళాలను దింపి యువతను నిర్దాక్షి ణ్యంగా తొక్కేయించింది. ఆడ, మగ అనే భేదం లేకుండా పోలీసులు లాఠీలు ఝుళిపించి వారు తలలు పగలగొట్టారు, స్పృహ తప్పేలా కొట్టారు.. మహిళలపై మగ పోలీసులు దాష్టికాలకు పాల్పడ్డారు..
విద్యార్థులపై హింసాకాండ.. కన్నీరు పెట్టిన దేశం
యూనిఫారంపై పేరు లేనివాళ్లు, అసలు యూనిఫారం లేకుండానే ముసుగు పెట్టుకొన్నవాళ్లు కూడా లాఠీలు పట్టు కున్నారు. మీరెవరు అని అడిగినవారి ఒళ్లంతా వాతలు పెట్టారు.. గంటల తరబడి సాగిన ఈ హింస కాండ వారిని భయపడి పారిపోయేలా చేయలేదు. 'కొట్టండి! ఇంకా కొట్టండి!' అంటూ కదలకుండా నిలబడే పట్టుదలను ఇచ్చింది. 20వ తేదీనాడు విద్యార్థులపై పోలీసుల హింసా కాండ ప్రపంచాన్ని నివ్వెర పరచింది. దేశం కన్నీరు పెట్టింది. ఇది ప్రజాస్వామ్య పాలనేనా? అని ప్రశ్నించింది. దెబ్బలు తింటున్నవారి హాహాకారాలు వీడియోల్లో చూసినవారు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు.. ఈ పరిణామాలకు దేశవ్యాప్తంగా యువత తీవ్రంగా స్పందించింది. హింసా కాండను, పోలీసుల, ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ దేశంలో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. అయిదు దక్షిణాది రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, బిహార్, చండీఘర్, వెస్ట్ బెంగాల్‌లలో కూడా భారీఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రద ర్శనలు జరిగాయి. తెలంగాణలో 24న విద్యా సంస్థల బంద్ జరిగింది. ఢిల్లీ నిరసనలో తమ పిల్లలు పాల్గొన్న వీడియోలను పోస్టు చేసి కొందరి తల్లిదండ్రులు గర్వంతో పొంగిపోయారు.
దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రిస్తూ..
అయితే దీనికి విరుగుడుగా ప్రభుత్వం ఉద్యమకారులను దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రించే ప్రయత్నం చేసింది. తమ చెప్పు చేతుల్లో ఉన్న మీడియాను వాడుకొని వీరంతా విదేశీ ఏజెంట్లు, అమెరికా నుంచి వచ్చిన సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే ఆ దేశ ఏజెంటు, మన దేశాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రల్లో లీకేజి ఉద్యమం ఒక భాగమంటూ చాలా పత్రికలు, న్యూస్ ఛానళ్లు రోజుల తరబడి కథనాలను ప్రచారం చేశాయి. బీజేపీ, కాషాయ వాట్సాప్ గ్రూపులు కూడా వీరిపై విషం చల్లే పోస్టులను కుమ్మరించాయి.. ఈ ఉద్యమం పేరుతో నేపాల్, బంగ్లాదేశ్ మాదిరిగా విద్యార్థులు దేశ వ్యతిరేక కలాపాలకు సిద్దమైతున్నారని బీజేపీ నేతలు వ్యాసాలు రాశారు. మోడీ సైతం తనదైన శైలిలో యువతను మురిపించే ప్రయత్నం చేశారు 'పేపర్ లీకేజీ మహా పాపం. చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేశాం' అంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
ప్రజలు నమ్మకపోవడంతో..
అయితే ఈ పాచికలేవి పారలేదు. మన మతం, మనోభావాలు దెబ్బ తీశారంటూ వచ్చే పోస్టులను నమ్మినట్లుగా ప్రజలు ఈ లీకేజి ఉద్యమ వ్యతిరేక పోస్టులను నమ్మలేదు.. పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ వైఫల్యం కళ్ల ముందు ఉన్నందున వండి వార్చిన అబద్ధాల వైపు జనం వెళ్లలేదు. మంత్రి రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడంతో గత్యంతరం లేకపోవడంతో చివరకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఉద్యమకారులు కోరిన మూడు ప్రధాన డిమాం డ్లను ఒప్పుకోవడంతో దేశం ఊపిరి పీల్చుకుంది. చివరి దాకా ఉద్యమకారులు పట్టుబట్టినట్లు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.. నెత్తురోడిన యువత ప్రభుత్వాన్ని తన దారిలోకి తెచ్చుకుంది.
- బద్రి నర్సన్
94401 2816






