- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతి ప్రతీకారం.. రైతులను ముంచిన రుతువులు
ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో నిరాశపరిచినా, చివర్లో విరుచుకుపడి రైతులను ముంచింది. జూన్‌లో వర్షాల మధ్య విరామాలు ఉండగా, తర్వాత ఉపరితల

ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో నిరాశపరిచినా, చివర్లో విరుచుకుపడి రైతులను ముంచింది. జూన్‌లో వర్షాల మధ్య విరామాలు ఉండగా, తర్వాత ఉపరితల ఆవర్తనాలు, అల్ప పీడనాలు, ద్రోణాలతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర సగటు వర్షపాతం 740.6 మి.మి కాగా, 33 శాతం అధికంగా 988.3 మి.మి గా నమోదైంది.
రుతువులు గతి తప్పి..
నైరుతి ఋతుపవనాలు తిరుగు ముఖం పట్టగా, అక్టోబర్ 15 లోపు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. దేశ వ్యాప్తంగా వాతావరణ మార్పులు భూగోళానికి సవాల్ విసురుతున్నాయి. అధిక ఉష్ణో గ్రతలు ఒకవైపు, అకాల వర్షాలు మరొకవైపు ఈ రెండింటి దెబ్బకు రుతువులు గతి తప్పుతున్నాయి. ప్రకృతి పగబట్టి అన్నదాతల ఆరుగాలం శ్రమను ముంచేస్తోంది. 2022–23లో వేడి తీవ్రత సాధారణం కంటే 30 రెట్లు అధికంగా నమోదైంది. గత 40 ఏళ్లలో 30 శాతం జిల్లాల్లో తక్కువ వర్షపాతం, మరోవైపు కొన్ని జిల్లాల్లో అతివృష్టి పెరిగిందని గణాంకాలు తెలుపుతున్నాయి.
అల్పపీడన ప్రభావంతో..
ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో నిరాశపరిచినా, చివరలో విరుచుకుపడి రైతులను ముంచింది. జూన్‌లో వర్షాల మధ్య విరామాలు ఉండగా, తర్వాత ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు, ద్రోణాలతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు తిరుగు ముఖం పట్టగా, అక్టోబర్ 15 లోపు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 137 మండలాల్లో అత్యధిక వర్షాలు (60% పైగా), 294 మండలాల్లో అధిక వర్షాలు (20–59%), 187 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇలా ప్రకృతి పగతో రైతులు విలవిలలాడుతున్నారు. ముందస్తు వర్షాలకూ, అధిక వర్షాలకూ ఇద్దీ పరిస్థితుల్లోనూ రైతన్నకు నష్టమే.
ఇది కేవలం వ్యవసాయ సమస్య కాదు..
మొదట్లో పత్తి సాగు ఉత్సాహంగా సాగినప్పటికీ, రెండు నెలల వర్షాభావం పంటల ఎదుగుదల దెబ్బ తీసింది. ఇప్పుడు తిరిగి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. పత్తి చేలల్లో మొలకలు వస్తున్నాయి, మొక్కజొన్న కుళ్లిపోతుంది, మిర్చి మొక్కలు కాయలతోనే కూలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 45.47 లక్షల ఎకరాల్లో పత్తి, 6.44 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.2 లక్షల ఎకరాల్లో మిరప సాగు జరిగింది. పంటలపై క్రమ పద్ధతిలో వర్షాభావం– అతివృష్టి దెబ్బ తగిలి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. నీటితో నిండిన పొలాల్లో వేర్లు ఊపిరాడక పంటలు ఎండిపోతున్నాయి. పత్తిలో రసం పీల్చే పురుగులు, మొక్కజొన్నలో కాండం కుళ్లు వ్యాపించాయి. ఇది కేవలం వ్యవసాయ సమస్య మాత్రమే కాదు, వాతావరణ సంక్షో భానికి సంకేతం కూడా. అకాల వర్షాలు, భూకంపాలు, ఆమ్ల వర్షాలు ఇవన్నీ మానవజాతి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. ఈ పరి ణామాలపై ప్రపంచ స్థాయిలో చర్చించి నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరం.
మానవ మనుగడను కాపాడాలంటే..
ప్రభుత్వాలు శీఘ్ర ప్రగతి పేరుతో సహజ వనరుల నాశనానికి దారితీసే పారిశ్రామికీకరణను నియంత్రించాలి. భూతాప ఉద్గారాలను తగ్గించే విధానాలు రూపకల్పన చేయాలి. వాతావరణ మార్పులను తట్టుకునే రకాల విత్తనాలను ప్రోత్సహించి, గ్రీన్‌హౌస్ సాగు, రక్షిత వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి. రైతులకు కోల్డ్ స్టో రేజీలు, శీతల రవాణా వసతులు, మెరుగైన సరఫరా గొలుసు వ్యవస్థలు అందుబాటులో ఉండాలి. మానవ మనుగడను కాపాడే మార్గం ప్రకృతిని గౌరవించడం ద్వారానే సాధ్యం. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరూ తమ వంతు బాధ్యత నిబద్ధతతో నిర్వర్తించి నప్పుడే ఈ భూమిపై జీవకోటి నిలబడగలదు.
- మేకిరి దామోదర్
95736 66650






