ప్రకృతి పరిరక్షణే మానవ మనుగడకు భరోసా!

by Ravi |   (  Updated:2026-07-28 00:31:06  IST  )

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులు, భూతాపం, అడవుల నరికివేత, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం వంటి సవాళ్లను విశ్లేషిస్తూ ప్రకృతి సంరక్షణలో ప్రతి పౌరుడి బాధ్యత..

ప్రకృతి పరిరక్షణే మానవ మనుగడకు భరోసా!
X

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఒకవైపు కరువు, మరోవైపు వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృ తి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావం, చైనాలో వరదలు, జమ్మూకాశ్మీర్‌‌లో ఆకస్మిక వరదలు, గుజరాత్, అస్సాంలో వరదల బీభత్సం ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నదనే విషయాన్ని తెలియ జేస్తున్నాయి. అడవుల నరికివేత, కాలుష్యం, సహజ వనరుల దుర్వినియోగం, మానవ స్వార్థం కారణంగా భూతాపం పెరిగి భూమి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాది జూలై 28న నిర్వహించే ప్రపంచ ప్రకృతి పరి రక్షణ దినోత్సవం ప్రకృతి సంరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. మన పూర్వీకులు పంచభూ తాలను దైవస్వరూపాలుగా భావించి, నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, వనమూలికల వినియోగం, జీవవైవిధ్య పరిరక్షణ వంటి ఆచారాలను పాటించారు.. ఆధునికత పేరుతో ఆ విలువలను విస్మరించిన ఫలితమే నేడు వాతా వరణ అసమతుల్యతగా కనిపిస్తోంది. ప్రపంచ జనాభా పెరుగుదలతో సహజ వనరులపై ఒత్తిడి పెరిగింది. గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. ప్లాస్టిక్ వినియోగం, రసాయనాల అధిక వాడకం, వాహనాల కాలుష్యం, అడవుల విధ్వంసం వల్ల జీవవైవిధ్యం ప్రమాదంలో పడింది. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛతను కోల్పోతున్నాయి.. అంటువ్యాధులు, కొత్త వైరస్‌లు మానవాళికి సవాలుగా మారు తున్నాయి. అందుకే ఇప్పటికైనా ప్రకృతి పరిర క్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కల పెంపకాన్ని విస్తరించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి. కాలుష్యరహిత ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియో‌గించాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సహజ జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశా లు సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి పరిర క్షణ ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి సామాజిక, నైతిక బాధ్యత. భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడటమే మాన వాళి మనుగడకు శాశ్వత భరోసా.

(నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం)

-సుంకవల్లి సత్తిరాజు

97049 03463

Next Story