- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించి, నవ్వులు పూయించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పరిశ్రమలో గత రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి, నవ్వులు పూయించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం (జులై 28) అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కాగా, పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు వెండితెరపై విశేషంగా ఆకట్టుకున్న హాస్య నటి, చివరి రోజుల్లో ఇన్ని కష్టాలు అనుభవించి కన్నుమూయడం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ప్రముఖులు మరియు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.






