- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రసారం మారింది... బాధ్యత మారలేదు!
భారత ప్రసార రంగం చరిత్ర, రేడియో నుంచి కృత్రిమ మేధస్సు వరకు వచ్చిన మార్పులు, ఆకాశవాణి సేవలు, డిజిటల్ మీడియా ప్రభావం, సమాచార ప్రసారంలో నైతిక బాధ్యత, ప్రతి పౌరుడి పాత్ర..

ఒకప్పుడు ప్రజలు వార్తల కోసం ఎదురు చూసేవారు. కానీ నేడు మనం వెతకకముందే వార్తలు మనకు చేరుతున్నాయి.. ఇవి వినిపించే సాధనంగా ప్రారంభమై ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో మరింత విస్తరించింది. అయితే ప్రసారం కేవలం సమాచారం అందించే సాధనమా? లేక సమాజాన్ని సరైన దిశగా నడిపించే బాధ్యత కూడా దానిదేనా? అనే ప్రశ్నను జూలై 23న నిర్వహించే జాతీయ ప్రసార దినం గుర్తుచేస్తుంది. గుగ్లియెల్మో మార్కొని వైర్‌లెస్ కమ్యూనికేషన్ ప్రయోగాలతో ఆధునిక రేడియో యుగానికి నాంది పలికింది. భారతదేశంలో 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ బాంబే కేంద్రం నుంచి తొలి రేడియో ప్రసా రాన్ని ప్రారంభించింది. అనంతరం ఆకాశవాణి దేశవ్యాప్తంగా విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, సాహిత్యం, సంగీతం, సంస్కృతి, ప్రజా చైతన్యానికి విశేష సేవలందించింది. సాంకేతిక అభివృద్ధితో దూరదర్శన్, ఉపగ్రహ ఛానళ్లు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధస్సు ప్రసార రంగాన్ని పూర్తిగా మార్చేశాయి. అయినప్పటికీ యంత్రాలు నిజాయితీ, నైతిక బాధ్యత, వాస్త వాల పట్ల నిబద్ధతను భర్తీ చేయలేవు.. సమాచారం వేగంగా వ్యాపించడం అభివృద్ధికి సంకేతమే అయినా, నిర్ధారణ లేని సమాచారం సమాజంలో గందర గోళాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. భిన్న భాషలు, సంస్కృతులతో కూడిన భారతదేశంలో ప్రజా ప్రసారం జాతీయ ఐక్యతను బలోపేతం చేసింది. నేడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తి ఒక ప్రసారకుడే.. కాబట్టి బాధ్యతాయుతంగా సమా చారాన్ని పంచుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం. ప్రసారం కేవలం ధ్వనిని లేదా సమాచారాన్ని చేరవేయడం కాదు.. నిజం, బాధ్యత, మానవత్వంతో సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి.
(నేడు జాతీయ ప్రసార దినోత్సవం)
- చిటికెన కిరణ్ కుమార్
94908 41284






