- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగబాబు.. ఏరు దాటాకా తెప్ప తగలెట్టొచ్చా?
ఏరు దాటడానికి అక్కడ కనిపించిన తెప్పను వాడుకుని, అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత ఇంక ఆ తెప్పతో మనకు అవసరం

ఏరు దాటడానికి అక్కడ కనిపించిన తెప్పను వాడుకుని, అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత ఇంక ఆ తెప్పతో మనకు అవసరం లేదని దాన్ని తగలబెట్టినట్లు చెయ్యకూడదని ఈ సామెత నీతి. ఇది సరిగ్గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో సరిపోతుందేమో..? పవన్ కల్యాన్ స్థాపించిన జనసేన గత ఎన్నికల్లో 21 సీట్లల్లో పోటీ చేసి వందకి వంద శాతం సీట్లు గెలిచి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండొచ్చు. కానీ గత ఎన్నికల సమయంలో ఆయన ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలో కూడా తెలియని పరిస్థితి. చివరకు పిఠాపురం స్థానాన్ని కోరుకున్నాడు.
ఎమ్మెల్సీ హామీతో..
పవన్ కల్యాన్ ఆ స్థానాన్ని కోరుకున్నప్పటికీ ఆయన పోటీపై చివరిదాకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే అప్పటికే అక్కడ ఓ సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో ఉన్న వర్మ మరోసారి ఆ స్థానం నుండి టికెట్ ఆశిస్తూ పోటీకి రెడీగా ఉన్నారు. అప్పటికే ఆయన నియోజకవర్గంలో కింద స్థాయి వరకు కేడర్ ఉన్న లీడర్.. కానీ టీడీపీ- జనసేన పొత్తు వలన ఆయన కొంచెం అయోమయంలోకి పడిపోయాడు.. అందుకే ఓ సారి టీడీపీ నాకూ టికెట్ ఇస్తుందని.. ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని అన్నాడు. దీంతో టీడీపీ అధినేత స్వయంగా రంగంలోకి దిగి పొత్తు ధర్మం ప్రకారం ఆయన కోరుకున్న సీటు ఆయనకు ఇవ్వాల్సిందేనని వర్మను ఒప్పింది ఎమ్మెల్సీ హామీతో పోటీ నుండి తప్పించారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాన్, వర్మకు గౌరవ మర్యాదల విషయంలో ఏ మాత్రం తక్కువ చూపలేదు. పిఠాపురంలో ఆయన ప్రసంగించిన ప్రతీసారి వర్మను పక్కనే పెట్టుకున్నారు. ప్రతీ సభలోనూ వర్మ తన సీటు కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేశారు.. అయితే ఎన్నికల్లో గెలిచాక సీన్ మారిపోయింది. ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడి జనసేన కార్యకర్తలు చేశారు.. దాన్ని కూడా వర్మ భరించారు.. ఎందుకంటే తనకు చంద్రబాబు అండ ఉన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తారని.
తమ్ముడు అలా.. అన్న ఇలా..
అయితే ఏం జరిగిందో ఏమో కానీ మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వర్మకు గ్యారెంటీగా దక్కుతుందనుకున్న ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. దీనికి జనసేన అండగా ఉంటుందనుకుంటే స్వయానా మంత్రి మనోహర్ ఏమో.. అదీ టీడీపీకి సంబంధించిన విషయం మాకు సంబంధం లేదు అని మాట్లాడారు.. మొన్నటి జనసేన ఆవిర్భావ సభలోనేమో.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు పిఠాపురంలో ‘పవన్ కళ్యాణ్ విజయానికి తానే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ’ అని వ్యాఖ్యానించారు.. ఆయన వర్మ పేరును ప్రస్తావించకపోయినా.. వర్మను పరోక్షంగా కామెంట్ చేశారని సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. గెలవకముందు తమ్ముడేమో వర్మ చేతుల్లో నా విజయం ఉందని వ్యాఖ్యానించి ఆయనను గౌరవించగా.. గెలిచాక అన్న ఇలా వ్యాఖ్యానించడం కరెక్టేనా? దీనిని ఏరు దాటాక తెప్ప తగలెట్టడం అనరా..? నాగబాబు అన్నట్టు పిఠాపురంలో పవన్ గెలవడానికి మొదటి కారణం పవన్ కల్యాణ్ , జనసైనికులే కావొచ్చు.. కానీ అంత మెజార్టీ రావడానికి ఎంతో కొంత వర్మ ప్రభావం ఉంది. దానిని గుర్తుపెట్టుకోవాలి. అంతేకానీ ఇలా కృతజ్ఞత లేకుండా మాట్లాడొద్దు. ఇలా మాట్లాడేవారు ఏ స్థాయిలో ఉన్నా ఆయా పార్టీల అధినేతలే కంట్రోల్ చెయ్యాలి. లేకపోతే ఆ పార్టీలకే నష్టం.
-రవీందర్
mr.ravinderbabu@gmail.కం
READ MORE ...
‘ఇది జగన్మాత ఆదేశం’.. పవన్ కల్యాణ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్






