రైళ్ల‌లో మిడిల్ బెర్త్‌లు తొలగించాలి!

by Ravi |   (  Updated:2025-03-11 00:30:37  IST  )

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన అందమైన అత్యాధునిక బోగీలను ఏర్పరుస్తుంది.

రైళ్ల‌లో మిడిల్ బెర్త్‌లు తొలగించాలి!
X

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన అందమైన అత్యాధునిక బోగీలను ఏర్పరుస్తుంది. అతివేగవంతమైన వందే భారత్ రైళ్ల ఇంజన్లను కూడా ఆకర్షణీయంగా తయారు చేసి నడుపుతున్నది. రైల్వే శాఖ కాలానుగుణంగా రైల్వే ప్రయాణికుల కోసం మార్పులు తెస్తుంది. దేశంలో రైళ్లు ప్రవేశపెట్టినప్పుడు మూడవ తరగతి బోగీలు కూడా ప్యాసింజర్ రైలులో ఉండేవి. ‌ఇందులో కూర్చోవడానికి సీట్లు కూడా ఉండేవి కావు. అవసరాలకు తగ్గట్టుగా ప్రస్తుతం జనరల్, స్లీపర్, థర్డ్, సెకండ్, ఫస్ట్ ఏసీ క్లాస్ బోగీలను నడుపుతున్నారు. గతంలో జనరల్ బోగీలలో కట్టె చెక్కలతో కూడిన సీట్లు ఉండేవి. ప్రయాణికులు పడుతున్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకొని వాటిని కూషన్ సీట్లుగా మార్చినారు.

అయితే స్లీపర్, థర్డ్ ఏసీ క్లాస్ బోగీలలో మార్పులు తీసుకొని రాకపోవడం వలన ప్రయాణికులు భరించరాని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ఊబ కాయంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోవడం వలన ప్రయాణికులు ఐపాడ్లు, ల్యాప్ టాప్ లో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా లోయర్ మిడిల్ బెర్త్‌లలో ప్రయాణం చేయడం కష్టతరమవుతున్నది. ఇంతే గాక అనారోగ్యం బారిన పడేందుకు ఆస్కారం ఉంటున్నది.

స్లీపర్ థర్డ్ ఏసీ భోగిలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో టూ టైర్ స్లీపర్, సెకండ్ ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి. టికెట్ ధరలు కూడా అధికంగా వసూలు చేయకుండా స్లీపర్ థర్డ్ ఏసీ ధరల ప్రకారం నిర్ణయిస్తే ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఫలితంగా రైల్వే శాఖకు నష్టాలు కూడా కలగకుండా ఉంటుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ సానుభూతితో పరిశీలిస్తుందని ఆశిస్తూ..

- దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story