శ్రమ జీవులకు స్పూర్తి మేడే

by Ravi |   (  Updated:2026-05-01 01:00:41  IST  )

మే డే సందర్భంగా కార్మికుల పోరాట చరిత్ర, శ్రమ గౌరవంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక సంక్షేమ పథకాలపై ప్రత్యేక విశ్లేషణ. శ్రామికుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమగ్ర సమాచారం.

శ్రమ జీవులకు స్పూర్తి మేడే
X

దేశానికి కర్షకుడి అవసరం ఎంత ఉందో కార్మికుడి అవసరం కూడా అంతే ఉంది. అభివృద్దిలో కార్మిక రంగానిది కీలక పాత్ర. శ్రీ శ్రీ అన్నట్లు శ్రమకు మించిన ఆయుధం లేదు.. శ్రమ శక్తి లేనిదే ఏ దేశ అభివృద్ధి జరగదు. అందుకే శ్రమను గౌరవించాలి, గుర్తించాలి..

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లి విరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదు. కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మే డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. నేడు 140వ మేడే పండుగను జరుపుకోవడంతో పాటు చంద్రన్న సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర శ్రామికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు..

19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పని చేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడిదారులు శ్రామికులతో బానిసల్లాగా పని చేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు.. పని స్థలాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు.. ఈ పరిస్థితికి భిన్నంగా, శ్రమ దోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మే డే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ఎనిమిది గంటల పని దినం అమల్లోకి రావడంతో జరు పుకునే పండుగే కార్మిక దినోత్సవం.

కార్మికుల జీవితాల్లో చంద్రోదయం..

కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శ్రామికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కార్మికుల సంక్షే మంపై చంద్రన్న ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్ర బాబుకు ఉన్న అపార అనుభవం, ముందుచూపు వల్ల తమకు మంచిరోజులు వచ్చాయని కార్మికలోకం సంబర పడుతున్నది. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరు‌ద్ధరించిన ఘనత చంద్రన్నకే దక్కుతుంది. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మర ణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్‌ అండ్‌ టి, ఎన్‌సీసీ, మిట్టల్‌ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు..

20 లక్షల మంది కార్మికులకు నైపుణ్య శిక్షణ

ఆధునిక పనిముట్లను కార్మికులకు అందించి నైపుణ్యాలు పెంచి అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పన దిశగా కసరత్తు సాగుతున్నది. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యా చరణను కూటమి ప్రభుత్వం చేస్తున్నది.. తరచు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి, యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంలో అతిశయోక్తి లేదు..

175 నియోజకవర్గాల్లో పరిశ్రమలు..

కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మికవర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వా‌నికే దక్కుతుంది.. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్ట జీవుల ప్రభుత్వంగా మారింది. 140వ మేడే సందర్భంగా చంద్రన్న పాలనలో శ్రామికుల జీవితాల్లో మరిన్ని చంద్రోదయ క్రాంతులు ప్రసరించాలని ఆశిద్దాం.

-వాసంశెట్టి సుభాష్

కార్మిక శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Next Story