మహాలక్ష్మితో మహిళకు మహర్దశ!

by Ravi |   (  Updated:2025-12-11 01:06:40  IST  )

తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కన్న కలల సాకారం దిశగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని భావించిన ప్రజల కలలు గత ప్రభుత్వ నయ వంచనతో కల్లోలలుగానే మిగిలిపోయాయి.

మహాలక్ష్మితో మహిళకు మహర్దశ!
X

తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కన్న కలల సాకారం దిశగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని భావించిన ప్రజల కలలు గత ప్రభుత్వ నయ వంచనతో కల్లోలలుగానే మిగిలిపోయాయి. తెలంగాణలో ప్రజలు కోరుకున్న ప్రజా పాలన ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను అందిస్తున్నది.

2023లో ప్రభుత్వం ఏర్పడిన 48 గంట ల్లోనే డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పథకం ప్రారం భించాం. పథకం ప్రారంభించిన కొద్ది రోజుల కి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసాయి. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఉపయోగపడుతుందని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సులభంగా వచ్చి వారి కుటుంబాలు ఆర్థిక వృద్ధి సాధించేలా మహిళా సాధికారతగా ముందుకు వెళ్తుందని ఈ పథకాన్ని మేధావులు కీర్తిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సైతం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై కొనియాడారంటే అది ఏ స్థాయి వరకు వెళ్లిందో ఆయన మాటలే నిదర్శనం.

పెరిగిన ఉపాధి అవకాశాలు..

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 252 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 8459 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది.. నెలకు 350 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా నా ఆడపడుచులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.

మహిళలే ఆర్టీసీ యజమానులు..

గ్రామాల నుండి కూడా రాజధానికి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు.. ఒక్కో కుటుంబం మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 5-6 వేల రూపాయలు ఆదా చేస్తుంది.. ఈ పథకంతో పాటు ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నది. మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేసింది ప్రజా పాలన ప్రభుత్వం. ఇప్పటివరకు 152 బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారు.. రానున్న కొద్ది రోజుల్లో మరో 448 బస్సులు మహిళా సంఘాల చేత కొనుగోలు చేయించనున్నాం. దీని ద్వారా వారి ఆదాయం మరింత పెరగనుంది. అలాగే మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలుకు సైతం బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. నెలకి 70 వేల రూపాయలు ఆర్టీసీ మహిళ సంఘాలకు చెల్లిస్తుంది.

మెరుగుపడిన ప్రజా రవాణా..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలే కాదు ప్రజా రవాణా సైతం మరింత మెరుగుపడుతుంది. గతంలో రాష్ట్రంలో ఉన్న 97 డిపోలు తీవ్ర నష్టాల్లో ఉండి ఆర్టీసీని మూసివేసే సంక్షోభ పరిస్థితుల నుండి నేడు 90 శాతం డిపోలు లాభాల్లోకి వచ్చాయంటే మహాలక్ష్మి నిదర్శనం. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం జాతర, హైదరాబాద్‌లో వినాయక, బోనాల ఉత్సవాలకు భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఇంట్లో పెద్దవారు డబ్బులు ఇస్తేనే బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మహిళలు నేరుగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు..

కోటి మంది మహిళా కోటీశ్వరులు..

మా ప్రభుత్వం మహిళలకు పెద్ద పీఠం వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తోంది.. వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుంది. మహిళలకు బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా క్యాంటీన్‌లు ఇలా ఎన్నో పథకాలు వారిలో ఆర్థిక వృద్ధిని సాధించేలా కృషి చేస్తుంది.

ఉచిత ప్రయాణంతో ఎన్ని లాభాలో...!

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా కుటుంబాలు ఎలా లాభపడుతున్నాయో మా ఆర్టీసీ నివేదికలో కొన్ని చూద్దాం.. స్వాతి అనే మహిళ చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోయారు. తను నిత్యం గజ్వేల్ నుండి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తూ తన నలుగురు చెల్లెలను చదివిస్తున్నారు. ఇందుకై స్వాతికి గతంలో 6 వేలు అయ్యేవి.. కానీ మహాలక్షి పథకం అమలు లోకి వచ్చిన తర్వాత తనకి నెలకి 6 వేల రూపాయలు ఆదా అవుతున్నాయని తన చెల్లలకు మరింత నాణ్యమైన విద్య అందిస్తున్నానని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

కరీంనగర్ నుంచి నిమ్స్‌కి రోగులు..

ఇక కరీంనగర్ నుండి నాకు తెలిసి ఒక కుటుంబం వారి సతీమణి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తనకి కేన్సర్ అని తేలడం వల్ల వారు ప్రతి వారం చెకప్ నిమిత్తం హైదరాబాద్ వచ్చి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం కావడం వల్ల వారు తమ ఇంటి దగ్గర నుండి హాస్పిటల్ కి వచ్చి మళ్లీ ఇంటికి వెళ్లే వరకు ఒక్క రూపాయి లేకుండా ప్రయాణం చేస్తున్నారు..

హైదరాబాద్‌లోనే చిన్న చిన్న వ్యాపారాలు..

ఆర్టీసీలో హైదరాబాద్‌కి చుట్టూ పక్కల జిల్లాల నుండి వచ్చి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం లాంటివి చేస్తున్నారు. వారికి మండల, జిల్లా కేంద్రాల్లో రోజువారీ ఆదాయం 500-1000 రూపాయలు రాగా, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఆర్టీసీ‌లో ఉచిత ప్రయాణం చేసి వ్యాపారాలు చేసుకోగా వారికి రోజుకు 2 వేల వరకు ఆదాయం వస్తుందని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పాలనను అమలు చేస్తున్నాం. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా.. రాష్ట్ర అభివృద్ధిలో ఇందిరమ్మ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఎన్నికల వరకే రాజ కీయాలు.. రాష్ట్ర అభివృధి కోసం, రాజకీయాలకు అతీతంగా పని‌చేద్దాం.

- పొన్నం ప్రభాకర్

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Next Story