- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాల్లో దీపాలుగా.. కార్మికుల ప్రాణాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పలు రాష్ట్రాల నుంచి కార్మికులు ఉపాధి కోసం వలస వస్తుంటారు. అంతేకాకుండా

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పలు రాష్ట్రాల నుంచి కార్మికులు ఉపాధి కోసం వలస వస్తుంటారు. అంతేకాకుండా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో, ఇటుక బట్టీల్లో పనిచేయడానికి పలు రాష్ట్రాల నుంచి పలువురు కూలీలు వస్తుంటారు.. వారు స్థానికంగా పని ప్రదేశం దగ్గర ఉండి తక్కువ కూలికి పని చేయడం వల్ల వారిని తీసుకొస్తుంటారు. అయితే యజమాన్యాలు వారితో పని చేయించుకుంటున్నాయి కానీ వారి భద్రతను మరిచిపోతున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు..
పని కోసం వలస వచ్చి..
మొన్న పాశమైలారంలో రియాక్టర్ పేలుడు దుర్ఘటన చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దాదాపు 40 మందికి పైగా కార్మికులు మరణించారని తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మృత్యులో బిహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారని తెలియవస్తుంది. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వలస వచ్చి ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేస్తుంది. పలు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మా కంపెనీలు, ఇతర కంపెనీలకు కార్మికులు పని చేయడానికి వస్తుంటారు.. అయితే ఈ పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. నిత్యం జరుగుతున్న ఘటనలతో కార్మికుల ప్రాణాలు పోతుండగా, చాలాచోట్ల కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెమికల్, ఔషధ పరిశ్రమల్లో వినియోగించే రసాయనలతో వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది.
చిన్న ప్రమాదం జరిగితే..
మెజారిటీ కంపెనీలు ప్రభుత్వ కనుసన్నలలో నడుస్తుంటాయి. అంతేకాకుండా ఆధిపత్య వర్గాల చేతిలోనే ఇవి ఉంటాయి. వారు అధికారులను కూడా కమ్ముతారు. ఈ క్రమంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరిగిన వారిని పట్టించుకునే నాధుడు లేకుండా పోతారు. ఇక వారి పిల్లలకు చదువు లేక బాల కార్మికులుగా మార్చుతున్నారు. అందుకే ఎన్నో ఏళ్లుగా కార్మికుల భద్రత, పరిశ్రమల్లో తనిఖీలపై ప్రభుత్వం దృష్టి సారించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. మొన్నటి ప్రమాదం చాలా పెద్దది కావున బయటకు వచ్చింది కానీ కొన్ని కంపెనీలలో కార్మికులు చనిపోయిన ఎవరికి తెలియకుండా వారికి ఎంతో కొంత పరిహారం ఇచ్చి బయటకు రాకుండా చూస్తారు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు చేశారు.. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని ఎన్నో ప్రకరణలు కార్మికుల సంక్షేమం గురించి తెలుపుతున్నాయి.
ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి!
గత అయిదు ఏళ్ల క్రితం పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020, వేతనాల కోడ్, 2019, సామాజిక భద్రత కోడ్, 2020లు ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు కార్మికుల వేతనాలు, పని గంటలు, సెలవులతో పాటు వారి భద్రత, సామాజిక భద్రత వంటి అంశాలపై నియమాలను రూపొందించాయి. ఇవీ కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను, భద్రతను, సంక్షేమాన్ని కాపాడటానికి రూపొందించబడ్డాయి. కానీ ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవు.. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా రసాయన కంపెనీలలో భద్రతా ప్రమాణాలు పరిక్షించాలి. పాటించని కంపెనీలు మూసివేయాలి. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలి. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల డేటా ప్రభుత్వం దగ్గర ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది.
సంపతి రమేష్ మహారాజ్
79894 79428






