ఈ ఆర్థిక సంక్షోభం తాత్కాలికమేనా?

by Ravi |   (  Updated:2025-04-09 00:30:41  IST  )

మొన్న భారత స్టాక్ మార్కెట్లు ఆకస్మిక పతనాన్ని చవిచూశాయి. ఈ ఊహించని స్టాక్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లలో

ఈ ఆర్థిక సంక్షోభం తాత్కాలికమేనా?
X

మొన్న భారత స్టాక్ మార్కెట్లు ఆకస్మిక పతనాన్ని చవిచూశాయి. ఈ ఊహించని స్టాక్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ ప్రభావం వెనుక డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌ విధానం ఉంది. ఫార్మా దిగుమతులపై సుంకాలు విధిస్తామన్న ఆయన ప్రకటన గ్లోబల్ మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఈ అంతర్జాతీయ అస్థిరత భారత మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.

మన బలహీనతలు బయటపెట్టింది!

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6% తగ్గడం, ఫార్మా షేర్లలో భారీ అమ్మకాలు ఈ పతనాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అమెరికా ఆర్థిక మందగమన భయాలు, టెక్ ఖర్చుల తగ్గింపు భారత ఐటీ రంగంపై వడిగా విరుచుకుపడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) భారీగా అమ్మకాలకు దిగడం, రూపాయి విలువ పడిపోవడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీశాయి. ఈ పతనం భారత ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టింది. ఫార్మా, ఐటీ రంగాలపై ఆధారపడటం, గ్లోబల్ వాణిజ్య విధానాల ప్రభావం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. రూపాయి బలహీనత దిగుమతి ఖర్చులను పెంచి, ద్రవ్యోల్బణ ఒత్తిడిని తెచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఈ సంక్షోభం తాత్కాలికమనే చెప్పవచ్చు, మార్కెట్ స్థిరీకరణ కోసం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలి. FIIలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు, ఫార్మా-ఐటీ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి. అమెరికాతో వాణిజ్య చర్చలు టారిఫ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇన్వెస్టర్లు వైవిధ్యమైన పెట్టుబడులతో రిస్క్‌ను సమతూకం చేయాలి. గ్లోబల్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు కీలకం.

౼శ్రీనివాస్ గౌడ్ ముద్దం,

80088 88834

Next Story