- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్యం.. చదువుకంటే విలువైనదా?
మా అమ్మాయి 8వ క్లాస్‌లో ఉన్నప్పుడనుకుంటా, వాళ్ల స్కూల్‌లో I -pad కంపల్సరీ అని ఒక కొత్త రూల్ తెచ్చినరు.. ఆల్రెడీ కొంతమందికి

మా అమ్మాయి 8వ క్లాస్‌లో ఉన్నప్పుడనుకుంటా, వాళ్ల స్కూల్‌లో I -pad కంపల్సరీ అని ఒక కొత్త రూల్ తెచ్చినరు.. ఆల్రెడీ కొంతమందికి ఐఫోన్, ఐపాడ్ ఉండే. మా అమ్మాయికి అప్పటికీ ఫోన్ కూడా లేదు.. ఎక్కువ బయటికి పోయి ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ వేసుకోవడం ఇష్టం. ముందే తను వద్దంది. క్లాస్‌లో తనొక్కతే ఐపాడ్ తీసుకొని పోలేదు.. మేము అనుకున్నట్టే స్కూల్ నుంచి పిలుపొచ్చింది.
ఐపాడ్ ఎందుకవసరమని మేమ డిగితే పిల్లలు టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నదాని కంటే ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి.. మేమిచ్చే అసైన్మెంట్ల కోసం గూగుల్ సెర్చ్ చేయాలి. బయటి ప్రపం చంతో పోటీ పడాలి.. వీళ్లు పెద్దయ్యాక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పనిచేస్తారు.. కాబట్టి ఇప్పటి నుంచి ఇట్లాంటి గాడ్జెట్స్ వాడాలి అని వాళ్లు చెప్పినరు..
అవసరం మించి జ్ఞానం అవసరమా?
పిల్లల వయసును బట్టి వాళ్ల మానసిక పరిపక్వతను బట్టి CBSE ఒక పద్ధతి ప్రకారం సిలబస్ తయారు చేస్తుంది. దాన్ని ప్రతి ఏడూ అవసరాన్ని బట్టి మారుస్తూనే ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ ఎందుకు నేర్చు కోవాలి? వాళ్ల అవసరాన్ని మించిన జ్ఞానాన్ని వాళ్లపై ఎందుకు రుద్దాలి? ఇట్ల ప్రతి ఒక్కరూ అనుకోబట్టే కదా బయట పోటీ ప్రపంచం తయారవుతోంది. దానికి బలయ్యేది తల్లితండ్రులో, టీచర్లో కాదు పిల్లలూ.. వాళ్ల బాల్యం. పోనీ కొంచెం అడ్వాన్స్‌డ్ విషయాలు, ఆడియో విజువల్ ఇంపాక్ట్‌తో చెప్పా లనుకుంటే ఒక కంప్యూటర్, ప్రాజెక్టర్ పెట్టి టీచర్ చెప్పొచ్చు కదా.. అసైన్మెంట్‌ల కోసం మంచి లైబ్రరీ ఏర్పాటు చేసి, బుక్స్ చదివి కావలసిన విషయాలు సేకరించమనొచ్చు కదా.. గూగుల్ సెర్చ్‌లో ఎక్కడి నుంచి తీసు కోవాల్నో, ఏం తీసుకోవాల్నో, ఎంత తీసుకోవాల్నో ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే పదేళ్ల పిల్లలూ, 50 ఏళ్ల పెద్దలూ ఎవరడిగినా అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే.. అది కాక ఎన్నో లింక్స్ వస్తాయి.. ఇంకా ఘోరమేందంటే, గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏజ్ సరిపోలేదంటే, డేట్ ఆఫ్ బర్త్ రెండేళ్లు ఎక్కువపెట్టి ఓపెన్ చేయండని పిల్లలకు సలహా ఇచ్చినరంట.. తప్పు అని చెప్పాల్సిన టీచర్లే పిల్లలకు మ్యా నిప్యులేషన్స్ చేయడం నేర్పిస్తున్నారన్న మాట.. పెద్దగైనాక ఎట్లైనా తప్పదు.. కాబట్టి వాళ్లను బాల్యంలో వీటికి వీలైనంత దూరంగా ఉంచాలి. కానీ, ఇప్పటినుంచి వాటిని అలవాటు చేసు కోవాలనడం సబబేనా?
సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా ఆశిస్తాం?
అసలు పిల్లలను ఈ మొబైల్, ఐపాడ్ అలవాటు నుంచి ఎట్లా తప్పించాలని తల్లిదండ్రులు చూస్తుంటే, చదువు కోసమని ఐపాడ్ కొనిస్తే వాళ్లను కంట్రోల్ చేయగలుగుతారా? డెస్క్‌టాప్ అయితే కొంచెమన్న గమనిస్తుండొచ్చు. ఏ మూలకో వాళ్లు ఐపాడ్ పెట్టుకుని చదువుతున్నామంటే మనం 24 గంటలూ వాళ్లను పర్యవేక్షిస్తూ ఉండలేం కదా.. అయినా ముందు ఐస్ క్రీమ్ పెట్టి తినొద్దంటే వాళ్లెట్ల కంట్రోల్ చేసుకో గలుగుతారు.. దీనికి సమాధానంగా స్కూల్ వాళ్లు చెప్పిందేమంటే, పిల్లలు సెల్ఫ్ కంట్రోల్ అలవాటు చేసుకో వాలంట. పెద్దోళ్లం మనమే ఇంటర్నెట్ డిస్ట్రాక్షన్స్ తప్పించుకోలేకపోతుంటే పిల్లల నుంచి సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా ఆశిస్తాం? వీటన్నింటి కంటే, మా అమ్మాయి చెప్పిన కారణం చాలా బలమైనది. అంతకు ముందు స్కూల్లో బ్రేక్ సమయంలో మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ ఉండేవాళ్లం.. కానీ ఇప్పుడు అందరూ ఐపాడ్ పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ వాటిల్లో మునిగిపోయి పిలిచినా పలకడం లేదని చెప్పింది. నిజమే కదా.. పిల్లలను బడికి పంపేది కేవలం చదువు కోసమే కాదు.. తోటి పిల్లలతో ఆడుకోడానికి, ఎంజాయ్ చేయడానికి, సోషల్ స్కిల్స్ పెంచుకో వడానికి కూడా.. కానీ పిల్లలను వీటి నుంచి గ్యాడ్జెట్స్ దూరం చేస్తాయి.
మేము ఒప్పుకోకపోవడంతో..
మొత్తానికి మేము ఒప్పుకోలేదు.. మా అమ్మాయిని చూసి ఇంకొంత మంది ఐపాడ్ పంపలేదు.. తర్వాతి సంవత్సరం ఆ రూల్ తీసేశారు.. ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పేదేమిటంటే వాళ్ల బాల్యం కన్నా వాళ్లకి ఏదీ ముఖ్యం కాదు.. వాళ్లకు అవసరమైన దానికన్నా ఎక్కువ నేర్పించి పిల్లల అమాయకత్వాన్ని, మంచి రిజల్ట్స్ కోసమని గ్యాడ్జెట్స్‌ని అలవాటు చేసి వాళ్ల బాల్యాన్ని లాక్కోవడం అన్యాయం.. స్కూల్స్ కూడా యావరేజ్ పిల్లలను దృష్టిలో ఉంచుకొని సిలబస్, అసైన్మెంట్స్ తయారు చేయాలి. ఆలోచించండి!
-మాలతి పల్లా
సీనియర్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్,
9010396655






