- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడజన్మ శాపమా?
ప్రస్తుతం సమాజంలో ఆడవారిపై ఆకృత్యాలు పెరిగిపోయాయి. మగాడికి నెలలతో నిండిన గర్భిణీని చూస్తే కామమే, నెలల బిడ్డను

ప్రస్తుతం సమాజంలో ఆడవారిపై ఆకృత్యాలు పెరిగిపోయాయి. మగాడికి నెలలతో నిండిన గర్భిణీని చూస్తే కామమే, నెలల బిడ్డను చూసినా కామమే, నేలపై నడుస్తున్న ఆడపిల్లని చూసినా కామమే, రేపో మాపో పోయే ముసలమ్మను చూసినా కామమే.. అసలు తప్పెక్కడ జరుగుతుంది. తల్లిదండ్రుల పెంపకంలోనా! పెరిగే వాతావరణమా? అమ్మ రొమ్ము పాలు తాగే కదా అంత వాళ్లు అవుతారు. మరి ఆకలి తీర్చిన రొమ్మును చూస్తే అంత కామమెందుకు? పురిటి బిడ్డ నుండి పండు ముసలి దాకా రక్షణ కోసం గావుకేకలేస్తుంటే.. ఎందరో తల్లులు కడుపు కోతతో గుండెలు బద్దలవుతుంటే న్యాయం కోసం ఎక్కడ వెతకాలి. రాజ్యాన్ని నిందించాలా! దుండగులతో ప్రజాస్వామ్యం నిండిపోయింది అనాలా! దీనిని సరి చేసేది ఎవరు..? ఇలాంటి ఆలోచనలు కలిగిన జాతిని మృగజాతి అనాలేమో?
తప్పు ఎక్కడ జరుగుతుంది?
ఆడపిల్ల పేరులోనే వేరు చేసింది సమాజం. ఆడపిల్ల అంటే పుట్టిల్లు తనది కాదు. అత్తింటి వారు అక్కున చేర్చు కోరు. అన్ని బాధలు, అవమానాలు పడి జీవితాన్ని గెలవాలని ప్రయత్నిస్తుంటే బజారు కుక్కల్లా మీద పడి పీక్కుతింటున్నారెంటి..? ప్రస్తుతం ఆడవాళ్లు.. మగాడితో సమానంగా విజయకేతనం ఎగురవేస్తున్నారు. అంతరిక్షయానం చేస్తు న్నారు. దూర దేశాలు వెళ్లి విద్యను అభ్యసిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి బేషుగ్గా బతుకుతూ తమకు తాము గౌరవం తెచ్చుకోవడమే కాకుండా కన్న వారికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చి సంతృప్తిని స్తున్నారు. కంటే కూతుర్నే కనాలి అనిపించుకునే రీతిగా ఈనాడు ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి బంగారు తల్లుల భవిష్యత్‌కి బాటలు వేయాలి గాని, బీటలు వేసి తగలెట్టేస్తూ, ముక్కలు చేస్తూ ముచ్చటైన జీవితాన్ని చెల్లాచెదురు చేసే స్తున్నారు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది. శిక్షలు లేవనా! న్యాయస్థానాలు తీర్పులు త్వరపెట్టలేవనా? ఒడిని చేర్చుకొని పాలిచ్చి, లాలించి పెంచిన నీ తల్లి ఒక ఆడది. గుండెలకు హత్తుకుని నీ ఇచ్ఛను తీర్చి మరో బిడ్డకు జన్మనిచ్చే నీ ఆలీ ఒక ఆడది. అది మరచిపోయి విషం చిమ్మే పాములా బుస కొడుతూ ఆడదాని ఉసురు పోసుకోవద్దు.
కఠిన శిక్షలు అమలు చేయకపోతే..
ఆడపిల్లల విషయంలో ఏం మారింది? పుట్టిన బిడ్డకు వడ్ల గింజ వేసి చంపేసే ఆ రోజుల నుండి.. పుట్టి ఊయలూగే బిడ్డను తీసుకెళ్లి తన మర్మాంగాలపై కోర్కెలు తీర్చుకునేంతగా మారింది. ఇలాంటి మృగాలు తప్పు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు తెలియజేసే చర్యలు చేపట్టాలి. అవసరమైతే ఇలాంటి వారిపై షరియా చట్టాలు అమలు చేయాలి. ఏదైనా తప్పు జరిగాకా అన్ని మూడు రోజులు ఒకే దృశ్యాన్ని చూపించిన టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాలు తప్పు చేసినోడి ముసుగు తీసి ఎలాంటి శిక్ష విధించారో ఒక్కరోజు చూపించినా తప్పు చెయ్యాలనే ఆలోచనకే భయపడాలి. అందుకు ప్రభుత్వం, న్యాయస్థానాలు విధి విధానాలు మార్చాలి. మనం బావున్నాం అది చాలు అనుకుంటూ పోతే దేశంలో ఆడజాతి అంతరించిపోతుంది. అప్పుడు భవి ష్యత్‌లో మగవారికి సరిపడా ఆడపిల్లలు దొరకరు.. అప్పుడు అడవుల్లో జంతువుల మాదిరి మారిపోతుంది దేశంలో పరిస్థితి. అంటే, బలహీన జంతువును బలం కలిగిన జంతువు పీక్కు తిన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు.. తప్పు చేసిన వారికి శిక్షలు కఠినంగా అమలు చెయ్యండి. ప్రజల్లో మార్పు వచ్చేలా జీవోలు తీసుకురండి. ఆడది వ్యసనం కాదు జీవితాన్ని ప్రసాదించిన దేవత అని తెలిసేలా చేయాలి.
-వాసి జ్యోత్స్న
9866843005






