- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దన్న యుద్ధోన్మాదం..
ఇజ్రాయెల్‌తో కలిసి, ఇరాన్‌పై దాడులు జరపడం అమెరికా దుందుడుకు వైఖరికి నిదర్శనం. దౌత్య పరమైన చర్చలు జరుగుతుండగానే, ప్రమాదకర స్థాయి కవ్వింపులేవీ కనబడకుండానే ఒక సార్వభౌమ దేశంపై దాడులు చెయ్యడాన్ని ప్రపంచదేశాలు ఖండించాల్సిందే.

పశ్చిమాసియాని నేరుగా అమెరికా యుద్ధరంగంగా మార్చేయడం ఖండనీయం. ఇజ్రాయెల్‌తో కలిసి, ఇరాన్‌పై దాడులు జరిపి ఆ దేశపు సుప్రీం అయితుల్లా ఖమేనీ సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారుల్ని, మాజీ దేశ అధ్యక్షుడిని, వందలాది పౌరుల్ని పొట్టన పెట్టుకోవడం, ఆవాసాల్ని ధ్వంసం చెయ్యడం అమెరికా దుందుడుకు వైఖరికి నిదర్శనం. దౌత్య పరమైన చర్చలు జరుగుతుండగానే, ప్రమాదకర స్థాయి కవ్వింపులేవీ కనబడకుండానే ఒక సార్వభౌమ దేశంపై దాడులు చెయ్యడాన్ని ప్రపంచదేశాలు ఖండించాల్సిందే.. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, నాగరిక విధానాలకు ఈ చర్యలు పూర్తి వ్యతిరేకం. ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాకా భారత్ -పాక్‌ల మధ్య యుద్ధం జరగకుండా ఆపానంటూ.. తన పనికి నోబెల్ శాంతి బహుమతి రావాలంటూ. అలా నోటితో అంటూనే చేతల్లో మాత్రం వెనెజులా అధ్యక్షుడిని బందీగా ఎత్తుకుపోయింది అమెరికా. నేడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ప్రత్యక్ష దాడులకు దిగింది. గత నాలుగు దశాబ్దాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న ఇరాన్‌ని ఆంక్షలతో కట్టడి చెయ్యలేక, అణ్వాయుధాల సాకుతో, అక్కడి అంతర్గత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మారణహోమం మొదలుపెట్టింది. ఇరాన్ అందుకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై దాడుల్ని గురిపెడుతూనే హోర్మేజ్ జలసంధిని మూస్తున్నట్లు ప్రకటించింది. ఆ జలసంధి మూసివేతతో ఆయిల్ సరఫరా అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ నష్టపోతాయి. ఆర్థిక నష్టం మాట అటుంచితే, ఇలా ఒక దేశాన్ని తనకు నచ్చినప్పుడు ధ్వంసం చెయ్యడం అన్ని దేశాలకీ ప్రమాదం.. ఈ ధోరణిని స్పష్టంగా వ్యతిరేకించాలి. వాణిజ్య యుద్ధంలో తన పర భేదాలు లేవంటూ ట్రంప్ ఇప్పటికే తన విధానాల ద్వారా తెలియజెప్పారు. ఏ యుద్ధమైనా, ఎవరిపైన అయినా ఎప్పుడైనా చేస్తానంటూ ఆయన హుంకరిస్తే, అందుకు ప్రపంచదేశాలు మౌనం వహిస్తే ఆ ధోరణితో బలహీన దేశాలు బలిపీఠం ఎక్కుతాయి. కొత్త తీవ్రవాదం పుట్టుకు వస్తుంది. ఆర్ధిక వ్యవస్థ, భద్రత, ప్రగతి గాలిలో దీపాలౌతాయి.. అందుకనే ఇరాన్‌పై దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన సందర్భమిది.
- డా. డి .వి.జి.శంకరరావు,
94408 36931






