- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్‌లో మేధో మథన సమావేశాలు జరపాలి!
భారత పార్లమెంట్, ఇది మన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే, దాని పనితీరును నిశితం గా పరిశీలిస్తే

సమయం దురదృష్టవశాత్తు అరుపులు, వాకౌట్లతో వ్యర్థమవుతోంది, అక్కడ నిర్మాణాత్మక చర్చలు జరగడం లేదు. ఇది ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు లోతైన పరిష్కారం లేకుండా చేస్తుంది. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా, శాసనసభ సమగ్రతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎంపీలు పార్లమెంట్‌లో జరుగుతున్న విషయాలను ప్రజలకు క్రమం తప్పకుండా తెలియజేయడం, వివిధ సమస్యలపై విభిన్న ప్రజా అభిప్రాయాలను సేకరించడం అవసరం. ఈ డేటాను పద్ధతి ప్రకారం సేకరించి, ఉపయోగించినట్లయితే, పార్లమెంటరీ చర్చలను గణనీయంగా మెరుగుపరుస్తుంది, విధాన రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తుంది. తద్వారా చట్టాలు నిజంగా ప్రజల ఆకాంక్షలు, అవసరాలను ప్రతిబింబిస్తాయి. కానీ ప్రస్తుతం, ప్రజా ప్రతినిధులు ఎన్నికల ప్రచారాలలో లేదా ఏదైనా ప్రారంభోత్సవం ఉంటే తప్ప ప్రజలలో కనిపించరు. ఇంకా వారికి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి? ఆ సమస్యలను సభల్లో ఎలా ప్రస్తావిస్తారు? అలాగే రాజ్యసభకు సినీ తారలను, క్రీడా ప్రముఖులను నామినేట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ వారు సభలకు హాజరుకాడం లేదు. అందుకే వారిని కాకుండా సమాజంలో గుర్తింపు పొందిన, అవార్డులు పొందిన ప్రముఖ సామాజిక కార్య కర్తలకు నామినేట్ చేస్తే సామాజిక సవాళ్లపై వారి లోతైన అవగాహన, ప్రజా సంక్షేమానికి నిరూపితమైన నిబద్ధతతో, పార్లమెంటరీ చర్చలకు మరింత అర్థవంతంగా దోహదపడే అవకాశం ఉంది. ఇక సభ్యులు ప్రజా సమ స్యల మూల కారణాలను గుర్తించడానికి ప్రజల్లో ఉండా లి. వారి సమస్యలను సభల్లో ప్రస్తావించి ఆ సమస్యలకు సమర్థవంతమైన నివారణ చర్యలు, పటిష్టమైన చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్‌లో మేధో మథన సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది సాధ్యమయితేనే ప్రజా సేవను ప్రతిబింబించే పార్లమెంట్ అవుతుంది.
-కె. లక్ష్మణ రావు
81797 31467






