- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెలుగుమట్లలో అమానవీయ చర్యలు..
వెలుగమట్ల పేదల ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన వారిని తాత్కాలిక శిబిరాల నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రభుత్వాధికారులు ఒత్తిడి చేస్తున్నారు..

వెలుగమట్ల పేదల ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన వారిని తాత్కాలిక శిబిరాల నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రభుత్వాధికారులు ఒత్తిడి చేస్తున్నారు.. కూల్చివేతకు గురైన వెలుగుమట్ల కాలనీని ఓపిడిఆర్, వెలుగుమట్ల భూదాన వినోబా కాలనీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గత ఆదివారం సందర్శించినప్పుడు అనేక ఆందోళనకరమైన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. నిర్వాసితులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయడానికి యత్నిస్తున్న పోలీసులు తమను అడ్డుకున్న నిర్వాసితులపై లాఠీ చార్జి చేశారు, మహిళలు, పిల్లలను కూడా గాయపరిచారు. నిర్వాసితులకు మంచి నీళ్లు, ఆహారం వంటి కనీసావసరాలను తీర్చడానికి వస్తున్న గ్రామీణ పేదల సంఘం కార్యకర్తలను అరెస్టు చేయబూనుతున్నారు, ప్రజలను కలవడానికి ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థల వారిని కూడా అడ్డుకుంటున్నారు. ఇక్కడి నిరాశ్రయులను చెల్లాచెదరు చేయడానికి వారి వారి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆర్థిక సర్వే పేరుతో మభ్యపెడుతున్నారని, తిరిగి వారి వారి స్వగ్రామాలకు పంపాలని యత్నిస్తున్నారు. ఆధార్ కార్డుల పరిశీలన కోసమని కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి, ఇళ్ల స్థలాల కమిటీకి తాము లక్షల్లో ఇచ్చామని తప్పుడు ఆరోపణలు చేయించడానికి ఒత్తిడి చేస్తున్నారు. వారికి ఇక్కడే మంచి ఇళ్లు కట్టిస్తామని ఆశచూపిస్తూ, తమకు కావలసిన సాక్ష్యాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నరు. గతంలో కూడా పోలీసులు ఇలాగే తప్పుడు ఆరో పణలతో కేసులు పెట్టించారు.. ఇలాంటి అమానవీయ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సోమవారం వచ్చిన జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కూడా వివరించాం. నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
- డాక్టర్ జతిన్,
ఓపిడిఆర్ రాష్ట్ర నేతలు
98498 06281






