- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాదికి దాసోహమైన కేంద్ర మంత్రులు..
లోక్‌సభ నియోజకవర్గాల పెంపు నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరగడం, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశాలపై రాజకీయ విశ్లేషణ. జనాభా ప్రాతిపదిక ప్రతినిధిత్వంపై పెరుగుతున్న ఆందోళనలపై వివరణ.

దేశంలోని 547 లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు 66% నియోజకవర్గాలు అనగా 363 నియోజకవర్గాలు ఉత్తరాదిలో, దక్షిణాదిలో కేవలం 130 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉత్తరాది నాయకులు అధిపత్యం వహిస్తున్న పార్టీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో దక్షిణాదిలో అత్యంత బలంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించడంలో బీజేపీ సఫ లీకృతమైంది. కానీ అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కి రెండింతలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించమని అక్కడ సుదీర్ఘ ఉద్యమాలు జరుగుతున్నా, వాటిని ఉక్కు పాదంతో అణిచివేస్తూ హిందీ రాష్ట్రాల అధి పత్యం కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తంగా 50% లోక్‌సభ సీట్లు పెంచినప్పటీకీ ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఎప్పట్లాగే ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని విషయాలు ప్రచారంలో ఉండడంతో ఈ లోక్‌సభ నియోజకవర్గాల పెంపు విషయంలో దేశంలో ప్రజాస్వామ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్ర అధిపత్యంలోని కాంగ్రెస్ పార్టీ మినహా పెద్ద రాజకీయ పక్షాలు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజక వర్గాలను పెంచమని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం స్పష్టమే. అదే జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇప్పుడున్న 66% నుండి 75% పెరిగే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం మరింత దిగజారడం కనిపిస్తుంది. కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేసి దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతి నిధ్యాన్ని చాలావరకు తగ్గించాయి. దీంతో జనాభా ప్రాతినిధ్యం అవరోహణ క్రమంలో ఉంది. దీనిని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యక్తపరిచిన భయాందోళనలు సమంజసమే.. దీనిని ఖండించిన పార్లమెంట్ సభ్యులు, బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఉత్త రాదికి వారికి దాసోహం అయ్యారని బహిర్గతం అయింది.
-ఆళ్ల రామకృష్ణ
99669 44244






