- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదం ఆగాలంటే.. పాకిస్తాన్‌ను అష్ట దిగ్బంధనం చేయండి!
ఉగ్రవాదులు ఐఎస్ఐ పేరుతో ప్రపంచ దేశాలని భయభ్రాంతులకు గురిచేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ..

ఉగ్రవాదులు ఐఎస్ఐ పేరుతో ప్రపంచ దేశాలని భయభ్రాంతులకు గురిచేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ.. మరణహోమం సృష్టిస్తున్నారు. సామాన్య ప్రజలను అతి కిరాతకంగా చంపుతున్న ఉగ్రవాదులను అంతమొందించాలి. ఇందుకై ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలి. ఉగ్రవాదులకు అండగా నిలిచే వ్యక్తులను గాని దేశాలను గాని ఒంటరిగా చేసి ఉగ్రవాదులతో పాటు ఆ దేశాలపై పోరాటం జరపాలి. ఆ దేశాన్ని అష్ట దిగ్బంధనం చేయాలి. అప్పుడే ఉగ్రవాదం తగ్గుతుంది.
ప్రపంచ దేశాలకు తెలిసినా..
ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారిని మనదేశంపైకి ఉసిగొలుపుతూనే ఉంది. ఉగ్రవాదులు తమ నివాసాన్ని పాకిస్తాన్‌లో ఏర్పాటు చేసుకున్నారని ఇంచు మించు ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. కానీ ఏ ఒక్క దేశమైనా పాకిస్తాన్‌ని ప్రశ్నించడం లేదు. ఐక్యరాజ్యసమితిలో కూడా ఏ ఒక్క దేశానికి కూడా ఈ సమస్య పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశాలపై దాడులు జరగడం లేదు. కాబట్టే వారు ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక పాకిస్తాన్ ప్రజలు అక్రమంగా భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నారు. వారిలో కొందరికీ మన దేశం వీసాలు కూడా మంజూరు చేసింది. అలా వీసాలపై వచ్చిన వారు ఇక్కడి ముస్లిం యువతులను పెళ్లి చేసుకొని భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఇకనైనా భారత్ మేల్కొని దేశంలో ఉన్న ప్రతి పాకిస్తానీ పౌరుడిని పాకిస్తాన్‌కి పంపేయాలి.
అవసరమైతే యుద్ధం చేయాలి!
370 రద్దు చేయడం కన్న ముందు కాశ్మీర్‌లోని ముస్లిం అమ్మాయిలు పాకిస్తానీ అబ్బాయిలను పెళ్లాడితే అ పాకిస్తాన్ అబ్బాయికి భారతదేశ పౌరసత్వం లభించేలా 370 నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం 370 రద్దు తర్వాత పాకిస్తానీలు ఉక్కిరిబిక్కిరిపోయారు. చేసేదేమీ లేక ప్రస్తుతానికి కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులే పహెల్గాం దాడికి పాల్పడ్డారు. ప్రతి ఉగ్రవాదిని బంధించి బహిరంగంగానే మరణశిక్ష విధిం చాలి. పాకిస్తాన్ వల్ల భారతదేశం ఎంతోమంది సామాన్యులను కోల్పోయింది. రాబోయే తరాలు శాంతి భద్రతతో భారతదేశంలో నివసించాలంటే ఉగ్రవాదాన్ని అంతం అందించాలి. భారతదేశంలోని 140 కోట్ల మంది ఆకాంక్ష మేరకు పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సి వస్తే కచ్చితంగా యుద్ధం చేసి తీరాలి. ఇకపై ఉగ్రవాద దాడులలో మన సామాన్య ప్రజలను కాపాడుకునే బాధ్యత మన ప్రభుత్వాలపై, మన నాయకులపై ఉంది. ఇప్పటికైనా ఉగ్రవాదానికి ఏ ఒక్క భారతీయుడు బలి కాకూడదన్నది ప్రజల ఆకాంక్ష.
-సింగిరెడ్డి అశోక్ రెడ్డి
76618 01107
- Tags
- Pehalgam attack






