- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాలలు బలపడాలంటే.. టీచర్లదే బాధ్యత!
ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి చూపుతున్నారని

ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి చూపుతున్నారని చెప్పడంలో అతి శయోక్తి లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుండి విద్యా శాఖపై సమీక్షలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్ప టికే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తున్నారు.. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు ఇస్తున్నారు. స్కావెంజర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. వంట పాత్రలు కొత్తవి మంజూరు చేశారు. విద్యా సంవత్సరం ముందే విద్యార్థులకు బుక్స్, యూనిఫాం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమో షన్స్ ఇచ్చారు. అన్ని మండలాల్లో ఇంచార్జీ మండల విద్యాశాఖ అధికారులను, అలాగే జిల్లాలో విద్యాశాఖ అధికారులను నియమించారు. కొత్త టీచర్లకి 3 రోజు ల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పు డు వేసవి సెలవుల్లో పాత కొత్త టీచర్ల అందరికీ 5 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే విద్యార్థులను అన్ని రంగా ల్లో తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలి. టీచర్ల ఆర్థిక పర అంశాలు ఇతరత్రా అలవెన్స్ వంటి సమ స్యలు ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటూనే ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒకసారి తగ్గితే మళ్లీ పెంచుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం సడలకుండా కృషి చేయా ల్సిన బాధ్యత ప్రతి టీచర్ పైన ఉంది. ఆ దిశగా అడుగులు వేసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అలాగే ప్రతీ సంవత్సరం టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉంది.
-రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998






