పెరుగుతున్న' గిగ్ ' వర్క్ ఫోర్స్!

by Ravi |   (  Updated:2023-02-09 19:00:21  IST  )

పెరుగుతున్న' గిగ్ ' వర్క్ ఫోర్స్!... Growing Gig Work Force in india says muneer

పెరుగుతున్న గిగ్  వర్క్ ఫోర్స్!
X



కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో జీవన వ్యయం, ధరల పెరుగుదల భారీగా పెరిగింది. అందుకే స్వల్పకాలిక ఒప్పందంతో పనికి కుదరడం షరా మామూలు అయింది. అందుకే గిగ్ ఎకానమీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ గిగ్ ఫోర్స్‌లో ఫలాన పనికి గుత్తగా ఇంత మొత్తం అని మాట్లాడుకునే వీలుంది. ఇదీ ఓ ప్రాజెక్టు. దీనికి వచ్చే ఆదాయాన్ని గిగ్ ఎకానమీ అంటారు. ఈ గిగ్ వర్కర్లలో స్వయం ఉపాధి కార్మికులు, ఫ్రీలాన్సర్, పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఇందులోకి వస్తారు. గిగ్ వర్కర్లకు నిర్ణిత పనికి నిర్ణీత జీతం ఇస్తే సరిపోతది. గిగ్ అంటే (గ్రోయింగ్ ఇన్ గ్రేస్, గెట్టింగ్ ఇన్ గేర్). దేశంలో 2021 నాటికే 77 లక్షల గిగ్ వర్క్ ఫోర్స్ ఉంది. ఇది 2030 నాటికి 2.35 కోట్లకు పెరిగే పరిస్థితి ఉందని అంచనా.

దేశంలో 'గిగ్' వర్క్ ఫోర్స్ పెరుగుతూ వస్తోంది. గడచిన 45 ఏండ్లలో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం దేశంలో పెరిగింది. కొన్నేళ్లుగా ఎన్నికల్లో గెలవడానికి, అధికారం పొందడానికి రాజకీయ పార్టీలు నిరుద్యోగులకు ఇస్తున్న హామీలలో 10 శాతం కూడా అమలుకు నోచుకోవడం లేదు. 2014లో తొలిసారి, 2019లో రెండోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తమ పార్టీకి 35 శాతం ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది. ఈ లెక్కన గత ఎనిమిది ఏండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ ఎనిమిది ఏండ్లలో కనీసం 12 లక్షల ఉద్యోగాలు కూడా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయలేదు. భర్తీ చేసిన దగ్గర కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాత ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాలకు సంబంధించి ఆందోళనలు జరిగాయి. ఉద్యోగం లేక దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సమయంలో అమెరికాలో చేసే పనిలో అధిక స్వతంత్రం కల్పించే పనిగా గిగ్ ఎకానమీ మనదేశంలో ఉనికిలోకి వచ్చింది.

గిగ్ ఎకానమీ అంటే

కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో జీవన వ్యయం, ధరల పెరుగుదల భారీగా పెరిగింది. అందుకే స్వల్పకాలిక ఒప్పందంతో పనికి కుదరడం షరా మామూలు అయింది. అందుకే గిగ్ ఎకానమీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ గిగ్ ఫోర్స్‌లో ఫలాన పనికి గుత్తగా ఇంత మొత్తం అని మాట్లాడుకునే వీలుంది. ఇదీ ఓ ప్రాజెక్టు. దీనికి వచ్చే ఆదాయాన్ని గిగ్ ఎకానమీ అంటారు. ఈ గిగ్ వర్కర్లలో స్వయం ఉపాధి కార్మికులు, ఫ్రీలాన్సర్, పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఇందులోకి వస్తారు. గిగ్ వర్కర్లకు నిర్ణిత పనికి నిర్ణీత జీతం ఇస్తే సరిపోతది. గిగ్ అంటే (గ్రోయింగ్ ఇన్ గ్రేస్, గెట్టింగ్ ఇన్ గేర్). దేశంలో 2021 నాటికే 77 లక్షల గిగ్ వర్క్ ఫోర్స్ ఉంది. ఇది 2030 నాటికి 2.35 కోట్లకు పెరిగే పరిస్థితి ఉందని అంచనా. దేశంలో ఇప్పటికే మహిళా కార్మికుల భాగస్వామ్యం తగ్గింది. ఇది పురుషులకు సమానంగా ఉంటే మంచిది కానీ పరిస్థితి అలా లేదు. దేశంలోని ప్రజలు సంతోషంగా ఉండాలంటే పెయిడ్ లీవ్‌లు దొరికే జాబ్స్ రావాలి. దేశంలో టాక్స్ వసూళ్లు పెరిగాయి. ఏక కాలంలో పబ్లిక్ ఫైనాన్స్ బాగుపడటం లేదు. అది బాగుపడాలి. రెగ్యలర్ ఎంప్లాయిమెంట్ రావాలి. అప్పుడే సేవింగ్స్ పెరిగి కుటుంబ అవసరాలు తీరుతాయి. ఇవన్నీ జరగాలంటే దేశంలో కాంట్రాక్టు ఉద్యోగాలు బంద్ చేయాలి. సైన్యంలో ఇటీవల జరిపిన అగ్నివీర్ నియామకాలు ఒక షార్ట్ టర్మ్ ఎంప్లాయిమెంట్. ఇలాంటి షార్ట్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌లు హౌస్ హోల్డ్ ఎకనామీకి ఏమాత్రం మంచిది కానే కాదు.

నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతూ

నిజానికి దేశంలో 2009-10 తర్వాత ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. 2014 తర్వాత అది మరీ దిగజారే పరిస్థితి వచ్చింది. దేశంలో ఇతర దేశాల కంపెనీలకు ఇచ్చిన వెసులుబాట్ల ఒప్పందాలను కేంద్రం తుంగలో తొక్కడం వలన దేశం వదిలి తమ దేశాలకు వెళ్లాయి. దీనివలన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఇన్వెస్ట్మెంట్ రేట్ 2016-17 నుంచి భారీగా పడిపోయింది. ఉత్పత్తులు తగ్గి, దిగుమతులు పెరిగి, ఎగుమతులు పడిపోయి మన దేశం 10 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. సీఎంఐఈ ప్రకారం జమ్మూ- కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లలో ఇన్వెస్ట్మెంట్ భారీగా తగ్గి నిరుద్యోగం భారీగా పెరిగింది. ఇందులో హర్యానా నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే దేశంలో నిరుద్యోగుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంటే ఉద్యోగాలు ఇస్తున్నామని పచ్చి అబద్దాలు వైరల్ చేస్తుంది కేంద్రం.

బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగ ఖాళీల భర్తీ, పరీక్షల్లో పేపర్ లీకులు పెరిగాయి. ఇవి ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని నరేంద్ర మోదీ దేశంలో ఎక్కడ పర్యటించినా నిరుద్యోగుల ఉద్యోగాల అవకాశం మెరుగు పడుతున్న కారణంగా వారు సంతోషంగా ఉన్నారంటారు. గత ఏడాది ఆయన స్వయంగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ మాట ముచ్చట ఇంకా లేనే లేదు. బుద్ధి జీవులు జూట ప్రచారాన్ని నమ్మకుండా, గ్రౌండ్ రియాలిటీలో జరిగే నిజాన్ని గుర్తిస్తే మంచిది. ఒక్కటి కాదు, రెండు కాదు, దేశంలో చదువుకున్న నిరుద్యోగులే 17 కోట్లు ఉన్నారంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఒక వైపు ప్రపంచంలో మూడో కుబేరుడుగా ఉన్న కార్పొరేట్ గౌతమ్ అదానీ వ్యవహారం బట్టబయలయి ఆయన స్థానం 22కు పడిపోయిన పరిస్థితి ఉంది. 20 వేల కోట్ల ఎఫ్‌పీఓ వాపసు తీసుకోవడం జరిగింది. ఇది కూడా దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ పరిణామాల వల్ల కూడా ఉపాధి కోల్పోయే వారి సంఖ్య మరింత పెరిగే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా, ఈ పరిణామాల మీద ప్రధాని మౌనం వీడడం లేదు.

ఎండి.మునీర్

9951865223

Next Story