- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్తను ఉచితంగా తరలించండి!
హైదరాబాద్ నగరంలో ఖాళీ స్థలంలో దొరికితే చాలు చెత్తను పారవేస్తుంటారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్, పార్కుల వద్దనైతే

హైదరాబాద్ నగరంలో ఖాళీ స్థలంలో దొరికితే చాలు చెత్తను పారవేస్తుంటారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్, పార్కుల వద్దనైతే ఇది ఒక ప్రక్రియగా కొనసాగుతుంది. కొందరు చెత్తను తరలించే వాహనదారులకు పైసలు చెల్లించలేక ఈ పని చేస్తుంటారు. మరికొందరు వారికి పైసలు ఎందుకు చెల్లించాలనే ఉద్దేశంతో, మరికొందరు ప్రభుత్వమే భరించాలని ఉద్దేశంతో అక్కడ పారబోస్తున్నారు. ఇవి ఎక్కువ అవుతుండటంతో కార్పొరేషన్ వారు చెత్తను ఆయా స్థలంలో పారవేయకుండా నిరోధించడానికి కొన్ని స్థలాల్లో సిబ్బందిని నియమిస్తున్నారు. మరికొన్ని స్థలాల్లో రికార్డ్ మైక్ రూపంలో బోర్డుల ద్వారా ప్రకటనలు చేస్తూ చెత్తను ఈ స్థలంలో వేసేవారికి తగు జరిమానా విధించబడుతుందని, హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం చెత్తను ఉచితంగా తరలించడానికి ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు.
-దండంరాజు రాంచందర్ రావు
98495 92958






