- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వ అర్హత పరీక్షల ఫీజులు..
కూట్ల రాయి తీయలేని వాణ్ణి ఏట్లో రాయి తీయమన్నాడు అంట ఎనకటికి ఎవడో..!! అన్న చందాన ఉంది విద్యార్థి, ఉద్యోగార్థుల ప్రస్తుత పరిస్థితి.

‘కూట్ల రాయి తీయలేని వాణ్ణి ఏట్లో రాయి తీయమన్నాడు అంట ఎనకటికి ఎవడో..!! అన్న చందాన ఉంది విద్యార్థి, ఉద్యోగార్థుల ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్హత పరీక్షల దరఖాస్తుల రుసుములు విద్యార్థుల నడ్డి విరుస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో విడుదల చేసిన సెట్ (స్టేట్ ఎలి జిబిలిటీ టెస్ట్) దరఖాస్తు రుసుము 1,000 రూపాయలు ఉండగా, రుసుము చెల్లించే క్రమంలో అదనంగా మరో 29 రూపాయలు ఉంటుంది. ఇలా మొత్తం కలిపి 1,029 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక స్వతహాగా మొబైల్ ఫోన్‌ని వినియోగించి దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఇంటర్నెట్ లేదా మీసేవ సర్వీసులు తదితర మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 100 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అంటే మొత్తంగా ఒక్క అప్లికేషన్‌కు దాదాపుగా 1200 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. జనరల్ అభ్యర్థులకు మరో రెండు, మూడు వందలు అదనం. ఇక ఈ మధ్య విడుదల చేసిన టెట్-2026 విషయంలోనూ అంతే దరఖాస్తు రుసుము చెల్లించే సమయంలో అదనంగా 29 రూపాయలు, ఇంట ర్నెట్ సెంటర్ వాళ్లకు 100 రూపాయల సర్వీస్ చార్జీ చెల్లించాలి. ఇలా ఈ మధ్య కాలంలో విద్యా ర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నోటిఫికేషన్ దరఖాస్తు రుసుములు తలకు మించిన భారంగా మారుతున్నాయి. అందుకే అదనంగా ఉన్న 29 రూపాయలు చెల్లించే విధానాన్ని తొలగించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల దరఖాస్తు రుసుములు పెట్టినట్లు తక్కువ ధరకే పెట్టాలి. డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్షల రుసుములు అందుబాటులో ఉండేలా తీసుకుంటుందని ఆశిద్దాం.
-ధని ముదిగొండ
96661 09616






