- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు... చంద్రబాబు
చిత్తూరు జిల్లా, పులిచర్ల శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, 50 ఏళ్ల క్రితం, 1975 లో రాజకీయ జీవితం ప్రారం భించి, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగు తున్న రాజకీయ దురంధరుడు నారా చంద్ర బాబు నాయుడు.

చిత్తూరు జిల్లా, పులిచర్ల శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, 50 ఏళ్ల క్రితం, 1975 లో రాజకీయ జీవితం ప్రారం భించి, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగు తున్న రాజకీయ దురంధరుడు నారా చంద్ర బాబు నాయుడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో ఎం.ఏ అనంతరం, పీహెచ్‌డీ చేస్తూ, 1975లో చిత్తూరు జిల్లా పులిచర్ల శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
1977లో చంద్రగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి, 1978లో అదే నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై, రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ గానూ, 1980-82 కాలంలో ముఖ్యమంత్రులు టి. అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రి వర్గాల్లో సినిమా టోగ్రఫీ, చిన్న నీటి పారుదల, సాంకేతిక విద్య, పాడి, పశుసంవర్థక శాఖల మంత్రిగా పని చేశారు.
మహామహులతో పరిచయం..
తొలిసారి శాసనసభ్యులైన చంద్రబాబుకు, ఆ శాసన సభలో పుచ్చలపల్లి సుందరయ్య, సర్దార్ గౌతు లచ్చన్న, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, నాడు కేంద్ర మంత్రిగా చక్రం తిప్పిన ఎస్.జయపాల్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, తదనంతర కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్ రాజశేఖరరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కమ్యూనిస్టు యోధులైన కొరటాల సత్యనారాయణ, చెన్నంనేని రాజేశ్వరరావు, నర్రా రాఘవ రెడ్డి, మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు లాంటి వారితో కలిగిన పరి చయాలు, గరచిన అనుభవాలు తదనంతర జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించడానికి దోహదపడ్డాయి.
‘తెలుగు విద్యార్థి’నుంచి సీఎంగా ఎదిగి..
తదనంతరం ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కలిసి పదవి నుండి దింపినప్పుడు.. తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్య మంత్రిగా చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1986లో పార్టీ అనుబంధ సంఘం ‘తెలుగు విద్యార్థి’ని చంద్రబాబు ప్రారంభించారు. 1989లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందినప్పుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన ఎన్టీఆర్‌కు చేదోడు, వాదోడుగా ఉండి, అన్నీ తానై, 1994లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ముఖ్య కారకులయ్యారు.
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు..
1994లో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేసి, ఆనాడు లక్ష్మీ పార్వతి వలన తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభం తదనంతర పరిణామాల వలన చంద్రబాబు 1995 సెప్టెంబర్ 01వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసి, 2004 మే 13 వరకూ, రెండవసారి 2014 ఆగస్టు 08 నుండి 2019 మే 29న వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. మూడవసారి 2024 జూన్ 12న తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి, 2025 ఆగస్టు10వ తేదీ నాటికీ, ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకొని, విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ఒక్కరు కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు లేరు.
యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా..
1996 - 98లో 13 పార్టీల జాతీయ కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉండి హెచ్.డి దేవెగౌడ (1996-97), ఐకె గుజ్రాల్ (1997-98) లను ప్రధాన మంత్రులుగానూ, ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి గానూ, దళిత వర్గానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్ గానూ, కావలి ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గానూ, పూసపాటి అశోక్ గజపతి రాజును గవర్నర్ గానూ, బోళ్ల బుల్లిరామయ్య, కింజరాపు ఎర్రంనాయుడు, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, సముద్రాల వేణుగోపాలచారి, రేణుకాచౌదరి, సుజనా చౌదరి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మ సాని చంద్రశేఖర్‌లను, కేంద్ర మంత్రులుగా చేసి, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. 1999 లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ 29 ఎంపీ సీట్లు గెలు చుకుంది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు 2000 మార్చిలో హైదరాబాదును సందర్శించడంతో, దేశ రాజకీయాలలో మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన గౌరవం ఆయనకే దక్కింది.
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు..
1998లో భారత ప్రభుత్వం పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన సందర్భంలో, ప్రపంచ దేశాలు, భారతదేశంపై ఆంక్షలు విధించిన సందర్భంలో కూడా, ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం, అంతర్జాతీయంగా చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతలే కారణం. ఆనాడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుగా పనిచేసిన జేమ్స్ డి.వుల్ఫన్షన్‌కు, ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌కు, పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీలకే గాక, ఇంకా ఎందరో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు, రజనీకాంత్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర సినీ కళాకారులకు, చెరుకూరి రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ లాంటి పత్రికాధిపతులు కూడా చంద్ర బాబు దార్శనికతకు ముగ్ధులైన వారే. జాతీయ రాజ కీయాల్లో చంద్రబాబు ఎరుగని రాజ కీ యనేతలులేరు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులతో జాతీయ నాయకులతో స్నేహసంబంధాలు నెరిపారు. ఆ సంబంథాలే ఏపీకి ప్రయోజనాలు కల్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
వజ్రోత్సవం కూడా జరుపుకోవాలి..
09-09-2023 తేదీన జగన్ ప్రభుత్వంలో, నంద్యాలలో, చంద్రబాబును అరెస్ట్ చేసి, 53 రోజులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో, రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నిరసన సభలు, ఊరేగింపులు చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో, విప్లవాత్మక చర్యలు చేపట్టడంలో, నారా లోకేష్ రూపంలో, చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్లగల రాజకీయ వారసుడు వచ్చాడు. స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు, రాజకీయాలలో వజ్రోత్సవం (75 ఏళ్లు) జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
- తోపూరి గంగాధర్,
సమాచార హక్కు విభాగం చీఫ్
టీడీపీ కేంద్ర కార్యాలయం
98666 88689






