- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలు.. ఫొటో మార్ఫింగ్‌లకు భయపడకండి!
ఈ మధ్య సోషల్ మీడియాలో గిబ్లి, చాట్ జీపీటీ లాంటి ఫిల్టర్ వాడి అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించే వారు ఎక్కువయ్యారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో గిబ్లి, చాట్ జీపీటీ లాంటి ఫిల్టర్ వాడి అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించే వారు ఎక్కువయ్యారు. అమ్మాయిలు.. ఇలాంటి వారు మీకు ఎదురైతే భయపడకుండా ధైర్యంగా ఉండటం నేర్చుకోండి. ఎవరో పనికిమాలిన వాళ్లు మీ పిక్‌ని అసభ్యంగా మార్ఫ్ చేసి అప్లోడ్ చేసినా, చేస్తా అని బ్లాక్ మెయిల్ చేసినా బెదిరిపోయి వాళ్లకు లొంగిపోకండి. ఫోటో మార్ఫ్ చేస్తే ఏవో కొంపలు మునిగిపోయాయని, మీరు నిరాశ చెంది మీ జీవితం పాడు చేసుకోకండి. ఇలాంటివి ఎదురైతే మీ చదువు, కెరీర్, ముఖ్యంగా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ధైర్యం తెచ్చుకోని మీ పేరెంట్స్‌కి ధైర్యం చెప్పి అలా బెదిరించిన వారిపై పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వండి. పరువు గురించి మీ తల్లిదండ్రులు ఆలోచించి అందుకు వద్దని చెబితే షీ టీమ్‌ను ఆశ్రయించండి. ఎందుకంటే వారు మీ ఐడెంటిని రివీల్ చేయరు. ఒకవేళ మీ పేరెంట్స్‌కి ఇలాంటివి తెలియకపోతే, ఫొటోస్ మార్ఫింగ్ చేయడం ఎంత సులభమో చేసి చూపించి ఇది ఇంటర్నెట్‌లో సాధ్య మని తెలియచెప్పండి. మీరు భయపడితే ఇట్లాంటి పనులు చేసే వాళ్లకి బలమిచ్చినట్టే. వాడు బెదిరిస్తే ఇగ్నోర్ చేసి లేదా లైట్ తీసుకొమ్మని చెప్పి, నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్న అని వాడు బలహీన పడేట్టు చెయ్యండి. మీరు ధైర్యంగా ఉంటేనే వాడు ఇంకొకరి జోలికి పోకుండా ఉండేటట్లు చేయగలుగుతారు. ఈ జీవితం చాలా చిన్నది. ఇక సొసైటీ అంటారా, సొసైటీని రాయితో కొట్టండి. నిజమైన స్నేహితులు, మీ మేలు కోరే బంధువులైతే మీరెలాం టి వారో తెలుసు కాబట్టి మీ వైపు ఉంటారు. అట్ల ఉండని వాళ్ల స్నేహం, బంధుత్వం మీకు అవసరమే లేదు. ఎవ్వరికీ మీ తప్పు లేదని నిరూపించి వారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు.
మాలతి పల్లా
90103 96655






