న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గాల్గోటియా వివాదం.. భారత ప్రతిష్టకు మచ్చ!

by Ravi |   (  Updated:2026-02-24 01:01:05  IST  )

న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16-20 మధ్య నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు భారత ఏఐ ప్రతిష్టను ప్రపంచానికి చాటే అవకాశంగా నిలిచింది. అయితే Galgotias University స్టాల్‌లో ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి, ఏఐ పరిశోధనల నైతికతపై ప్రశ్నలను లేవనెత్తింది.

న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గాల్గోటియా వివాదం.. భారత ప్రతిష్టకు మచ్చ!
X

న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16-20 మధ్య నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు భారత ఏఐ ప్రతిష్టను ప్రపంచానికి చాటే అవకాశంగా నిలిచింది. అయితే Galgotias University స్టాల్‌లో ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి, ఏఐ పరిశోధనల నైతికతపై ప్రశ్నలను లేవనెత్తింది.

‘భద్రమైన, నైతికమైన, మానవకేంద్రిత ఏఐ’ అనే నినాదంతో జరిగిన ఈ సమ్మిట్ 4వది ఇంతకుముందు మూడు అంతర్జాతీయ సమ్మిట్‌లు యూకే, సియోల్, ప్యారిస్ దేశాల్లో జరిగాయి. దీనికి జాతీయ అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం దక్కింది. ఇందులో అంతర్జాతీయ ఏఐ సమ్మి‌ట్‌లో ప్రభుత్వాలు, అంత ర్జాతీయ సంస్థలు, టెక్ కంపెనీలు, శాస్త్రవేత్తలు, విశ్వ విద్యాలయాలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు..

మొదట్లో తామే తయారుచేశామని..

ఈ సమ్మిట్‌లో భాగంగా గాల్గోటియ యూనివర్సిటీ తమ స్టాల్‌లో ఒక ఏఐ ఆధారిత రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శిం‌చింది. మొదట ఇది తమ యూనివర్సిటీ పరి శోధన ఫలితంగానే తయారుచేశామని దాని పేరు ‘ఓరియన్’ అని ఆ యూనివర్సిటీ ప్రతినిధి ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా ఇదే విషయాన్ని పోస్ట్ చేశాడు.. దేశ మీడియాలో దీనికి విశేష ప్రాచుర్యం పొందింది. కానీ కొద్ది గంటల్లోనే ఆ రోబో డాగ్ చైనా కంపెనీ తయారు చేసిన కమర్షియల్ ఉత్పత్తి అని దాని పేరు యూనిట్రీ అని వెలుగులోకి వచ్చింది. 3 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎవరైనా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అని వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత సదరు యూనివర్సిటీ అది కేవలం విద్యార్థుల సందర్శనార్థం మాత్రమే పెట్టిందని తమ సంస్థ తయారు చేయలేదని వివరించింది. తామే తయారు చేశామని తప్పుడు సమాచారం ఇచ్చిందన్న కారణంతో తమ యూనివర్సిటీలోని ఒక మహిళ అధ్యాపకురాలని బాధ్యుల్ని చేసింది. అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు తీసిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గ్లోబల్ సమ్మిట్ స్టాల్‌ను గాల్గోటియా యూనివర్సిటీ అర్ధాం తరంగా ముగించుకుంది.

దేశం పరువు తీసిన యూనివర్సిటీ..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ యూనివర్సిటీ చైనా నుండి కొనుగోలు చేసిన రోబోటిక్ డాగ్‌ను తమ యూనివర్సిటీ విద్యార్థులు ఏఐను ఉపయోగించి తయారు చేసినట్టుగా యూనివ ర్సిటీలో 350 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ల్యాబ్‌ను స్థాపించినట్టుగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించింది. కరోనా సమయంలో కూడా ధ్వని తరంగాల ద్వారా కరోనా వైరస్‌ను అంతమొందించవచ్చని ఈ యూనివర్సిటీ విద్యార్థి పరిశోధన ద్వారా నిరూపితం అయిందని ప్రకటించి నవ్వుల పాలయ్యింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ యూనివర్సిటీ విద్యా ర్థులను బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని కోసం తీవ్రంగా వాడుకుంది. మరి ముఖ్యంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాని సునీల్ గల్గోటియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, బీజేపీ పార్టీతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి.. అందుకే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం గ్లోబల్ సమ్మిట్‌లో స్టాల్‌ను ఖాళీ చేయాలని మాత్రమే ఆదేశించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్న దేశ ప్రజలను దేశద్రోహులుగా, టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా, పాకిస్తాన్ చైనా ఏజెంట్లుగా ముద్రలు వేస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నేడు అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీసిన గాల్గోటియ యూనివర్సిటీపై ఏ విధమైన చర్యలు తీసు కోకపోవడం నేడు వీరి కపట దేశభక్తిని ప్రశ్నిస్తుంది.

ప్రభుత్వ యూనివర్సీటీలను పట్టించుకోకపోతే..

దేశంలో విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ వేగంగా జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఆ యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులకు ఫెలోషిప్ స్కాలర్షిప్స్‌లు ఇవ్వడం లేదు. విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసేలా మతోన్మాదాన్ని ప్రేరేపించే సిలబస్‌ను తీసుకొస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. వీటికి తోడు విదేశీ యూనివర్సిటీలు కూడా తీసుకొస్తామ ని పాలకులు పెద్ద ఎత్తున చెబుతున్నారు.. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు పట్టించుకోకపోతే గాల్గోటియ ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలు దేశంలో విచ్చలవిడిగా వస్తే మన దేశ విద్యార్థులకు విద్య దూరమవ్వవడమే కాకుండా అంతర్జాతీయ వేదికల్లో దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని దానికి ఒక మంచి ఉదాహరణ. గాల్గోటియా పరిణామం కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిన అంశంగా కాకుండా, భారత ఏఐ పరిశోధనల నైతికత, పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తింది.

-పి. మహేష్

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు

97003 46942

Next Story