పథకాలపై ఆధారం.. భవిష్యత్తుకు ప్రమాదం!

by Ravi |   (  Updated:2026-03-18 00:16:21  IST  )

ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాయి. నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా పథకాలను రూపొందించింది.

పథకాలపై ఆధారం.. భవిష్యత్తుకు ప్రమాదం!
X

ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాయి. నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా పథకాలను రూపొందించింది. దీంతో ఇది విభిన్న రంగాలలోని ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి. అయితే కాల క్రమేణా ఈ పథకాలు ప్రజల జీవితాల్లో ఒక అల వాటుగా మారిపోయాయి. ప్రతి ఏడాది లేదా ప్రతి విడతలో వచ్చే ఆర్థిక సహాయం కోసం అనేక మంది ఎదురు చూడటం మొదలైంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రైతులు ఈ డబ్బులపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఎనిమి దేళ్లుగా ఈ పథకాల ద్వారా డబ్బులు అందుకుంటూ వచ్చిన ప్రజలు ఇప్పుడు ఏదైనా కారణంతో ఆ డబ్బు లు ఆలస్యంగా వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. వ్యవసాయం చేయడం, కూలి పనులు చేయ డం వంటి సంప్రదాయ మార్గాలపై దృష్టి తగ్గి, ప్రభు త్వం నుంచి వచ్చే డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలు వంటి విషయాల్లో కూడా ఈ పథకాల డబ్బులపైనే ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పథకాల డబ్బులు సమయానికి రాకపోతే ప్రజల్లో ఆందోళన, అసంతృప్తి పెరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతన్నలు తమ కష్టాన్ని నమ్ముకుని పరస్పర సహకా రం చేసుకుంటూ జీవనం సాగించేవారు. స్వశక్తి మీద విశ్వాసం ఉండేది. కానీ ప్రస్తుతం కొంతమంది ప్రభుత్వ పథకాలపై అధికంగా ఆధారపడటం వల్ల పని మీద ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు తాత్కాలిక భరోసా మాత్రమే.. ప్రజలు కూడా వాటిని అలానే చూడాలి. స్వశక్తి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటేనే జీవితంలో స్థిరత్వం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చే పథకాలను సహాయ‌కంగా తీసుకుని, స్వంత కష్టంపై ఆధారపడి జీవనం సాగించడం అవసరం. పని మీద నమ్మకం, కష్టం మీద విశ్వాసం ఉంటేనే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలం.

- మలిపెద్ది పవన్ కళ్యాణ్

70930 52815

Next Story