- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు..ఎన్నాళ్లీ నిరీక్షణ?
ఆంధ్రప్రదేశ్‌లో, నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తరబడి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల కోసం

ఆంధ్రప్రదేశ్‌లో, నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తరబడి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల కోసం యువత ఆశా భంగంతో నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులపై కూడా అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇదే విషయంపై ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేసుకున్న యువతలో నిరు ద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంది. వీరిలో సుమారు 75 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన SSC, RRB వంటి పరీక్షలకు సిద్ధమవుతుండగా, మరో 15 శాతం మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.. మిగిలిన 10 శాతం నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగులు తాము చదివిన అర్హతలకు సంబంధం లేని పనులు.. అంటే షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాలు, హోటళ్లలో సేల్స్‌మెన్ లేదా సిబ్బంది పనులు చేయాల్సి వస్తోంది. అత్యధికంగా చదువుకున్న గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లే ఇలాంటి ఉద్యోగాలు చేయడం వారికి తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని యువత పెద్ద ఎత్తున పోటీ పరీక్షల కోసం కోచింగ్‌లు పూర్తి చేసుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా, మరికొంతమంది వ్యయ ప్రయాసలతో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టక పోవడం నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను పెంచుతోంది. ప్రభుత్వం గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ దానిపై స్పష్టమైన చర్యలు కనిపించక పోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబ్ క్యాలెండర్ విడుదలలో ప్రభుత్వం ‘మీన వేషాలు’ వేసుకుంటోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల సమస్యల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి స్థాయి జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేసి విడుదల చేయడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
-సంబాయపాలెం వెంకటేశ్వర్లు
96661 78607






