గురువులకు.. ఎందుకీ పరిస్థితి!

by Ravi |   (  Updated:2025-05-13 00:30:22  IST  )

నేడు ఉపాధ్యాయులు చిన్న తప్పు చేసినా అది వింతలా ప్రాచుర్యం పొందుతుంది. కారణం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే

గురువులకు.. ఎందుకీ పరిస్థితి!
X

నేడు ఉపాధ్యాయులు చిన్న తప్పు చేసినా అది వింతలా ప్రాచుర్యం పొందుతుంది. కారణం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయున్ని వారు ఆదర్భంగా, ప్రేరణగా తీసుకుంటారు. రేపటి పౌరులైన నేటి బాలలపై ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుందని అలాంటి ఉపాధ్యాయులు ఆదర్శ ప్రాయులుగా ఉండాలి. కానీ మారుతున్న నాగరిక సమా జంలో ఉపాధ్యాయ వృత్తికున్న ఆదరణ క్రమేణ తగ్గుతున్నది. విద్యార్థులను ప్రభావితం చేసే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతున్నది. పాఠాలు బోధించే గురువులపై కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా బోధన విషయంలో విద్యార్థులను చిన్నగా మందలించిన దానిని పెద్ద రాద్దాంతం చేసి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించిన సందర్భాలు కోకొల్లలు..ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పూర్వం గురువు దగ్గరకు విద్యార్థి వెళ్లి విద్యాభ్యాసం చేస్తే.. నేడు గురువులనే ఇంటికి రప్పించుకుని విద్యను బోధించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పిల్లలకు గురువులపై గౌరవం ఎలా కలుగుతుంది? ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిపై అభిమానంతో ఉపాధ్యాయులయ్యేవారు. ఇప్పుడు బతకడానికి ఉపాధి కొరకు ఈ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. నాణానికి బొమ్మ బొరుసులా ప్రతి రంగంలో మంచి చెడు ఉంటాయి. కావలసినదల్లా వృత్తి పట్ల గౌరవం, చేసే పని అంకిత భావంగా చేస్తూ నిరంతరం శ్రమించడానికి తపిస్తే ప్రతి వారు పిల్లలకు గొప్ప ఉపాధ్యాయులు కావచ్చు. అలాగే సత్ప్రవర్తనతో నిత్యం శ్రమిస్తూ, ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న విద్యార్థులు ఉన్నారు.. ఒక రోజున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి గురువులను సన్మానించి వారి గుణగణాలను చాటి చెప్పడం కాదు. మన జ్ఞాన జ్యోతిని నిరంతరం గౌరవించి, వారు చూపించిన మార్గంలో పయనించి తమ లక్ష్యాలను చేరుకున్న విద్యార్థుల విజయాలే ఆ గురువులకు నిజమైన ఆనందం. ఉపాధ్యాయులకు సంతృప్తికర విజ యాన్ని ఇవ్వగలిగేది తన విద్యార్థులు సాధించిన అద్వితీయ లక్ష్యాలు.. అలాంటి విద్యార్థులను ఉన్నత విజయ సాధకులుగా చేయడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు, అధికారులు, యువతరం, సమాజం సహకరించాలి.

-దుర్గమ్ భైతి

99590 07914

Next Story