- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Epstein Files: నిజాల వెనుక నిశ్శబ్ద భయం!
ఎపిస్టీన్ ఫైల్స్, జెఫ్రి ఎపిస్టీన్ కేస్, సోషల్ మీడియా ప్రభావం యువతలో ఆందోళన, మోరల్ ఇంజురీ, దీర్ఘకాలిక ఒత్తిడికి కారణమవుతుందని సైకాలజిస్టులు హెచ్చరించారు. సమాచారాన్ని జాగ్రత్తగా స్వీకరించడం, మనసును సంరక్షించడం అవసరం.

అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ‘ఎపిస్టీన్ ఫైల్స్’ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త నేర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి Jeffrey Epstein కేసుకు సంబంధించిన పత్రాలు బయటకు రావడం తర్వాత సామాజిక మాధ్యమాల్లో, వార్తా చానళ్లలో విస్తృత చర్చ జరుగుతోంది.
సమాజంపైనే అపనమ్మకం!
భారతీయ అధ్యయనంలో పిల్లలు, యువత ఎపిస్టీన్ ఫైల్స్ ప్రత్యేకంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే యువతలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ఇది ముఖ్యంగా అతిగా సెర్చింగ్, స్క్రోలింగ్ వల్ల ఉంది. ప్రజల మనసుల్లో కలవరానికి కారణం ఏమిటి? ఎపిస్టీన్ కేసులో ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా ఉండటం, ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లు వినిపించడం వంటివి సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ఎవరి ని నమ్మాలి’ అనే సందేహం పెరుగుతోంది. సమాజంలో ఉన్న పెద్దవాళ్లు కూడా ఇలాంటి కేసుల్లో ఉండవచ్చని భావన కొందరిలో భయాన్ని పెంచుతోంది. మనసు సహజంగా భద్రతను కోరుతుంది. కానీ ఇలాంటి వార్తలు చూస్తే ‘సమాజం అంతా భద్రంగా ఉందా?’ అనే అనుమానం కలుగు తుంది. ఇది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. మన మెదడు ప్రమాదాలను గుర్తించడంలో చాలా వేగంగా పనిచేస్తుంది. ఎపిస్టీన్ ఫైల్స్ వంటి వార్తలు ‘సామాజిక ప్రమాదం’గా మెదడు గుర్తిస్తుంది. అప్పుడు ఆందోళన హార్మోన్లు (అడ్రినలిన్, కార్టిసోల్) పెరుగుతాయి. హృదయ స్పందన వేగంగా అవుతుంది. మనసు అప్రమత్తంగా ఉంటుంది. ఈ పరిస్థితి తాత్కాలికంగా ఉంటే సమస్య కాదు. కానీ రోజూ అలాంటి వార్తలు చూస్తూ ఉంటే దీర్ఘకాలిక ఒత్తిడిగా మారుతుంది. భారతదేశంలో ప్రత్యక్షంగా ఈ ఫైల్స్‌పై ప్రత్యేక పరిశోధనలలో సైకాలజిస్టులు ఇలాంటి సంఘటనలు మనుషుల మనసుపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించారు..
‘మోరల్ ఇంజురీ’ అంటే ఏమిటి?
కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇలాంటి కేసులు ప్రజల్లో ‘మోరల్ ఇంజురీ’ అనే భావోద్వేగ గాయాన్ని కలిగించవచ్చు. అంటే.. సమాజంలో నైతిక విలువలు, న్యాయం, నిజాయితీ ఉన్నాయని మనం నమ్ముతాం. కానీ పెద్ద వ్యక్తులు, శక్తివంతమైన వారు తీవ్రమైన నేరాల్లో ఉన్నారనే వార్తలు వస్తే ఆ నమ్మకం దెబ్బతింటుంది. దీంతో సమాజంపై నమ్మకం తగ్గుతుంది. ‘ఎవరూ నిజాయితీగా లేరు’ అనే భావన పెరుగుతుంది. నిరాశ, అసహాయత భావాలు వస్తాయి.. ఇది కొందరికి దీర్ఘకాలిక ఆందోళనకు దారి తీసే అవకాశం ఉంది. సైకాలజిస్టులు చెబుతున్న మరో విషయం ‘కలెక్టివ్ ట్రామా’ అంటే ఒక పెద్ద సంఘటన సమాజంలోని చాలా మందిని ఒకేసారి మాన సికంగా కలవరపెడితే దాన్ని కలెక్టివ్ ట్రామా (సామూహిక మానసిక షాక్) అంటారు.
నిపుణుల సూచనలు..
మానసిక ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. వార్తలను పరిమితంగా చూడాలి. నమ్మకమైన వనరుల నుంచి మాత్రమే సమాచారం పొందాలి. సోషల్ మీడియాకు విరామం ఇవ్వాలి. భావోద్వేగంగా కలత కలిగితే కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబంతో, స్నేహితులతో మాట్లాడాలి. ఎపిస్టీన్ ఫైల్స్ వంటి సంఘటనలు సమాజంలో చర్చకు కారణమవుతాయి. అవి నిజాలను బయటపెట్టడంలో ముఖ్యమైనవే. కానీ అదే సమయంలో ప్రజల మనసుల్లో భయం, అనిశ్చితి, అనుమానం పెంచే అవకాశం కూడా ఉంది. అందుకే సమాచారాన్ని జాగ్రత్తగా స్వీకరించడం, మనసును సంరక్షించుకోవడం చాలా అవసరం. సమాచారం తెలుసుకోవడం హక్కు. కానీ మనసు ఆరోగ్యం కాపాడుకోవడం బాధ్యత.
- అనూరాధ నాయుడు ఎం,
మనోవికాస నిపుణులు
83175 88344






