- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వ్యసనం చిన్నారుల భవిష్యత్తుకు ముప్పు!
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా చిన్నారుల మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతోంది? ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నియంత్రణలు, స్క్రీన్ టైమ్ ప్రభావాలు, తల్లిదండ్రుల బాధ్యతలపై విశ్లేషణ.

నేటి డిజిటల్ యుగంలో సమాచారం అరచేతిలోకి రావ డం సౌభాగ్యం అయినప్పటికీ, చిన్నారులపై ఇది శాపంగా మారుతోంది. విజ్ఞానాన్ని పంచే సాంకేతికత, తెలియని వయ సులో పిల్లలను సోషల్ మీడియా ఉబ్బిళ్లలోకి నెట్టేస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికలు కేవలం వినోద సాధనాలు మాత్రమే కాక, పిల్లల ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి.. ఇది సామాజిక మార్పు మాత్రమే కాక, తరం మానసిక ఆరోగ్యంపై జరుగుతున్న దాడి. దీనిని ఆపడానికి అంతర్జాతీయంగా కొన్ని దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం ఉంది. చైనాలో స్క్రీన్ సమయంపై కఠిన పరిమితులు ఉన్నాయి. యూకే, స్పెయిన్, నార్వే వంటి దేశాల్లో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయబడింది. భారతదేశంలోనూ ఈ చర్చ పెరుగుతోంది. కర్ణాటక ప్రభు త్వం 16 ఏళ్లలోపు, ఆంధ్రప్రదేశ్ 13 ఏళ్లలోపు పిల్లలపై నియంత్రణలపై దృష్టి సారిస్తోంది. గణాంకాల ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు.. రోజుకు మూడు గంటల పైగా స్క్రీన్ గడపే పిల్లల్లో కోపం, ఒంటరితనం, నిద్రలేమి లక్షణాలు పెరుగుతున్నాయి. శారీరక సమస్యలు, సామాజిక నైపుణ్య లోపం వారిని సమాజానికి దూరం చేస్తాయి. లైకులు, ఫాలోవర్ల కోసం అనవసర పోలికలు, సైబర్ వేధింపులు, అసభ్యకర కంటెంట్ వారిని నేరాల వైపు నడిపిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన అల్గారిథమ్స్ పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నాయి. ఇదొక రకమైన ‘డిజిటల్ డ్రగ్’ అని విమర్శలు ఉన్నాయి. సమస్యను ప్రభుత్వ నియంత్రణకే వదిలించకూడదు. తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ అలవాట్లను నియంత్రించి, నాణ్యమైన సమయం, డిజిటల్ క్రమశిక్షణను ప్రోత్సహించాలి. సాంకేతికత మానవ వికాసానికి ఉపయోగపడాలి, వినాశకానికి కాదు. సురక్షితమైన బాల్యం మాత్రమే సుస్థిర భవిష్యత్తుకు మార్గం. సోషల్ మీడియా మాయలో మునిగే తరం రక్షించడం మనందరి తక్షణ కర్తవ్యం.
-ముద్దం నరసింహస్వామి
99498 39699






