సినిమాల్లో వివిధ జానర్లు..

by Ravi |   (  Updated:2025-08-16 01:15:16  IST  )

చిన్నప్పుడు తెలుగులో ఎన్టీ రామారావు నటించిన పాతాళ భైరవి, అగ్గిపిడుగు, చిక్కడు దొరకడు, మాయాబజార్, శ్రీకృష్ణ పాండవీయం

సినిమాల్లో వివిధ జానర్లు..
X

చిన్నప్పుడు తెలుగులో ఎన్టీ రామారావు నటించిన పాతాళ భైరవి, అగ్గిపిడుగు, చిక్కడు దొరకడు, మాయాబజార్, శ్రీకృష్ణ పాండవీయం, ఏ.ఎన్.ఆర్ నటించిన మూగ మనసులు, మంచి మనసులు, కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు ఇట్లా అనేక రకాల సినిమాలు చూస్తున్నప్పుడు భిన్నమైన కథలు వాటి ధోరణులు ఆ వివరాలు తెలియకుండానే ఒక్కో రకం సినిమాలు ఒక్కో కథతో ఒక్కో రకంగా ఉండేవి. ఒక్కో నటుడికి ఒక్కో దర్శకుడికి తలా ఒక రకం సినిమాల బ్రాండ్ వుండేది. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, డిటెక్టివ్, సస్పెన్స్ క్రైం అట్లా విభిన్న రకాలైన సినిమాలని డిఫరెంట్ ‘జానర్స్’ అంటారు.

ఈ ‘జానర్’ అనే పదం ఫ్రెంచ్ భాష నుండి వచ్చింది. దాని అర్థం శైలి లేదా రకం. సినిమాల్లో జానర్ అంటే ఆ సినిమా చెప్పే కథ, సంఘటనలు, మూడ్, కథన శైలి వీటి ఆధారంగా ఆ సినిమాకు ఆ జానర్ పేరు పెడతారు. ప్రతి జానర్‌కు దాని ప్రత్యేకమైన రీతి, తీరు, ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ప్రతి జానర్‌కు తనవైన స్వంత లక్షణాలు, నిర్మాణరీతి, ఆ సినిమాల ప్రేక్షకులను ఆకర్షించే పద్ధతులు ఉంటాయి.

యాక్షన్ జానర్

జానర్లల్లో అనేక రకాలున్నాయి. ప్రముఖ జానర్లల్లో ‘యాక్షన్ ’ విశ్వవ్యాప్తమైంది. యాక్షన్ సినిమాలు వాటి లక్షణాలను చూస్తే వాటిల్లో తీవ్రమైన భౌతిక చర్యలు పోరాటాలు, ఛేజింగ్‌లు, స్టంట్స్, హై-స్టేక్స్ సంఘర్షణలు, సాధారణంగా హీరో vs. విలన్. వేగవంతమైన పేసింగ్, దృశ్యమాన ఆకర్షణ ప్రధానమైనవి. ఈ జానర్లో వివిధ దేశాల్లోని వివిధ భాషా సినిమాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. యాక్షన్‌లో ఉప-జానర్‌లు కూడా వున్నాయి. అవి స్పై థ్రిల్లర్, సూపర్‌హీరో. వీటిల్లో ఉత్సాహం, ఉద్విగ్నత, హీరోయిజం, హీరోయిజం హీరోయిక్ విజయాలు ప్రధానంగా ఆకర్షణీయంగా ఉంటాయి.

డ్రెమటిక్ జానర్

రెండో రకం జానర్స్‌లో డ్రామా ప్రధానమైంది. వాటి లక్షణాలను చూస్తే వాటిల్లో మానవ సంబంధాలు, భావోద్వేగ లోతు, వాస్తవిక జీవన సంఘర్షణలపై దృష్టి, ముఖ్యంగా కనిపిస్తాయి. వాటికి తోడు అందులోని పాత్రల మధ్య అంతర్గత పోరాటాలు లేదా సామాజిక సమస్యలు ఉంటాయి. వాటికి తోడు బలమైన సంభాషణలు, అయా పాత్రల పరిణామం ఉద్వేగం లాంటి మానవ సంబంధాల ఎమోషన్స్ అన్నీ వుంటాయి. డ్రామాల్లో ఉప-జానర్‌లు కూడా ఉన్నాయి. అవి రొమాంటిక్ డ్రామా, కుటుంబ డ్రామా. ఈ సినిమాలు ప్రధానంగా మానవ సానుభూతి, భావోద్వేగ అనుబంధాలతో నిర్మాణమవుతాయి.

కామెడీ జానర్

ఇక కామెడీ మరొక ముఖ్యమైన జానర్. వీటి లక్షణాలు చూస్తే హాస్యం, తేలికైన టోన్, ఉల్లాసకరమైన సంఘటనలు కనిపిస్తాయి. నవ్విస్తాయి. వీటిల్లో తరచుగా అతిశయోక్తి లేదా విడ్డూరమైన పరిస్థితులు, సంతోషకరమైన ముగింపులు ఉంటాయి. కామెడీలో ఉప-జానర్‌ల విషయానికి వస్తే రొమాంటిక్ కామెడీ, వ్యంగ్యం వుంటాయి. ఇవి ముఖ్యంగా వినోద ప్రధానమైనవి. ఇక థ్రిల్లర్ జానర్ సినిమాల లక్షణాల విషయానికి వస్తే సస్పెన్స్, ఉద్విగ్నత, ఊహించని ట్విస్ట్‌లు, తరచుగా క్రైమ్, మిస్టరీ, లేదా డేంజర్‌తో ముడిపడి ఉంటుంది. వీటిల్లో ఉప-జానర్‌లుగా సైకలాజికల్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్‌లను చెప్పుకోవచ్చు. థ్రిల్లర్‌ కథ కథనాల్లో ఆద్యంతం ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంటాయి.

రొమాన్స్ జానర్

ఇక మరో ముఖ్యమైన జానర్ రొమాన్స్. వీటి లక్షణాలు గమనిస్తే ముఖ్యంగా ప్రేమ, సంబంధాలు,అనుబంధాలు, భావోద్వేగ అనుబంధంపై దృష్టి కలిగి వుంటాయి. ఇవి చాలాసార్లు సంతోషకరమైన ముగింపు లేదా విషాదకర ముగింపులతో వుంటాయి. రొమాంటిక్ జానర్లల్లో ఉప-జానర్‌లను చూస్త్శే రొమాంటిక్ కామెడీ, ట్రాజిక్ రొమాన్స్‌లను చెప్పుకోవచ్చు. వీటిల్లో ప్రేమ, ఆశావాదం ట్రాజెడీ ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇక సైన్స్ ఫిక్షన్ వీటిల్లో సస్పెన్స్, మిస్టరీ, మరియు ఊహించని ట్విస్ట్‌లు. క్రైమ్, డిటెక్టివ్, లేదా సైకలాజికల్ సంఘర్షణలు ప్రధానంగా ఉంటాయి. ఉద్విగ్న సంగీతం, వేగవంతమైన పేసింగ్లు కనిపిస్తాయి.ఇంకా ఊహాత్మక భవిష్యత్తు, టెక్నాలజీ, లేదా అంతరిక్ష పరిశోధనలు కూడా వుంటాయి.

హారర్ జానర్

మరో జానర్ హారర్ సినిమాలు. వీటి లక్షణాల్లో ప్రధానంగా భయం, ఉద్విగ్నత, అతీంద్రియ శక్తులు లేదా సైకలాజికల్ సమస్యలు, భయానకాలు, భీతి లేదా షాక్ సృష్టించడం వుంటాయి. ఇక హారర్స్‌లో ఉప-జానర్‌ల విషయానికి వస్తే సైకలాజికల్ హారర్ (Hereditary), స్లాషర్ (Scream). ప్రేక్షకుల్లో భయం, థ్రిల్. కలిగించడమే వీటి లక్ష్యం. ఇక ఫాంటసీ చిత్రాల లక్షణాలు చూస్తే మాయాజాలం, అతీంద్రియ జీవులు, లేదా ఊహాత్మక ప్రపంచాలు ఉంటాయి. ఫాంటసీ లోని ఉప-జానర్‌లలో ముఖ్యమయినవి ఎపిక్ ఫాంటసీ, అర్బన్ ఫాంటసీ. ఇంకా ఇతర జానర్‌ల విషయానికి వస్తే వెస్ట్రన్, మిస్టరీ, బయోపిక్ నిజ జీవిత కథలు..

యానిమేషన్ జానర్

మరో సాంకేతిక జానర్ యానిమేషన్. వీటిల్లో యానిమేటెడ్ కథనాలు ఉన్నాయి. ఇవన్నీ పోను ఇటీవలి సాంకేతిక పరిణామ క్రమంలో అనేకానేక కొత్త రీతిలో కొత్త అజనర్లు కూడా రూపొందుతున్నాయి. వీటికి తోడు కేవలం ప్రత్యేకంగా ఇవే అని కాకుండా చాలా సినిమాలు ఒకటి కంటే ఎక్కువ జానర్‌లను మిళితం చేసి రూపొందుతాయి అవి హైబ్రిడ్ జానర్‌లు. జానర్ అనేది ఒక సినిమా గుణగణాలను దాని స్వభావాన్ని, ప్రేక్షకుడికి తెలియజేసే సాధనంగా చెప్పుకోవచ్చు. ఒక దర్శకుడు లేదా రచయిత సినిమా జానర్‌ను అర్థం చేసుకుని తాను తీయబోయే సినిమా కథను రూపొందిస్తే సినిమా ఎంతో బలంగా నిలుస్తుంది. ప్రతి జానర్‌కు తనదైన గొప్పదనం ఉంది. కథ,కథన శైలి, పాత్రల కూర్పు, నేపథ్యం ఇవన్నీ ఆ సినిమా రూపొందే జానర్ ఆధారంగా మారుతాయి. పుర్రెకో రుచి జిహ్వకో రుచి అన్నట్టు ప్రేక్షకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో జానర్ సినిమా నచ్చుతుంది.

- వారాల ఆనంద్

94405 01281

Next Story