- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పతనం దిశగా ప్రజాస్వామ్యం!
స్థానిక ప్రభుత్వాల ద్వారానే గాంధీజీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సాధ్యమవుతుందని ఆశించి చేసిన 73, 74 రాజ్యాంగ సవరణలు నేడు కాగితాలకే పరిమితమవు తున్నాయి. అధికార వికేంద్రీకరణ జరిగి పాలన ప్రజల ముంగిట ఉండాలనేది ఈ చట్టాల అసలు ఉద్దేశ్యం.

స్థానిక ప్రభుత్వాల ద్వారానే గాంధీజీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సాధ్యమవుతుందని ఆశించి చేసిన 73, 74 రాజ్యాంగ సవరణలు నేడు కాగితాలకే పరిమితమవు తున్నాయి. అధికార వికేంద్రీకరణ జరిగి పాలన ప్రజల ముంగిట ఉండాలనేది ఈ చట్టాల అసలు ఉద్దేశ్యం. కానీ, నేడు ఆదర్శాలు మరుగునపడి, స్థానిక సంస్థలు కేవలం రాజకీయ చదరంగంలో పావులుగా మారిపోయాయి.. దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఒకరి మీద ఒకరు నెట్టేయడం కంటే, ఇది వ్యవస్థీకృత వైఫల్యం అని అంగీకరించాలి. ఈ పరిస్థితిలో అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే ఎన్నికల వ్యయం. ఓటమి భారంతో కుంగిపోతున్న అభ్యర్థులు గెలుపు కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు తెచ్చి కోట్లు కుమ్మరిస్తున్న అభ్యర్థులు, ఓడిపోయాక దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నారు. పెట్టిన పెట్టుబడి రాలేదనే ఆవేదన, సమాజంలో పరువు పోయిందనే అవమానం వారిని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి. ఒక వ్యక్తి సేవ చేయడానికి సిద్ధపడితే, ఆ ప్రయత్నం అతడిని చితి వరకు తీసుకెళ్లడం మన వ్యవస్థ ఎంతగా దిగజారిందో తెలియజేస్తోంది. పెట్టుబడిగా రాజకీయం అధికారం అంటే సేవ కాదు, అదొక 'పెట్టుబడి' అనే ధోరణి పెరిగింది. గెలిచిన వారు పెట్టిన సొమ్మును వడ్డీతో సహా రాబట్టాలని అవినీతికి పాల్పడుతుంటే, ఓడిన వారు ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.. ప్రజల బాధ్యతారాహిత్యం ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజలు తమ ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. డబ్బు ఇచ్చే నాయకుడిని ఎంచుకున్నప్పుడు, అభివృద్ధి గురించి అడిగే నైతిక అర్హతను వారు వదులుకుంటున్నారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి అందించిన ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలంటే, స్థానిక సంస్థలకు జీవం పోయాలి. అధికారం అంటే ఆధిపత్యం కాదు, అది అట్టడుగు ప్రజల అభివృద్ధికి వేసే బాట అని గుర్తించాలి. ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతిని ప్రజలు బహిష్కరించినప్పుడే, నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు. మార్పు మన ఇంటి నుండే, మన ఓటుతోనే మొదలవ్వాలి.
-చింత ఆమని,






