- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా మాంజాతో ఉరే..!
నేను ఖైరతాబాద్ లోని మా ఆఫీసుకి రోజూ బైకు మీదనే వస్తాను. అలాగే బుధవారం కూడా ఆఫీసుకి బైక్ పై వస్తున్నాను.

నేను ఖైరతాబాద్ లోని మా ఆఫీసుకి రోజూ బైకు మీదనే వస్తాను. అలాగే బుధవారం కూడా ఆఫీసుకి బైక్ పై వస్తున్నాను. సంక్రాంతి పండుగ వేళ రోడ్లు కాస్త ఖాళీగా ఉన్నాయి కదా అని స్పీడ్ పెంచాను. కొంచెం దూరం రాగానే నా కాలికి ఏదో చుట్టుకున్నట్లయ్యంది. వెంటనే ఒళ్లు ఝలదరించింది. చూస్తే ఇంకేం ఉంది? చైనా మాంజా! కాలికి చుట్టుకున్న దారాన్ని మెల్లగా తీసి దూరంగా పడేశాను. ఆ స్పీడ్‌లో నా మెడకు చుట్టుకొని ఉంటే.. ఇంకేమైనా ఉందా? నా పని గోవిందా! రోజూ ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చైనా మాంజాపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాను. కానీ నా దాకా వస్తే తప్ప దాని ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందో అర్ధం కాలేదు. తమ దాకా సమస్య వస్తే చూద్దాం అనుకుంటే పొరపాటే. ఏదో ఒక రోజు ఆ ప్రమాదం మనకే రావచ్చు. ఇప్పటికే కొందరు చిన్నారులు చావు దాకా వెళ్లొచ్చారు. ఆఖరికి ఓ పోలీసు అధికారి మెడకు కూడా ఉరి కాబోయింది. కాస్త ఉంటే ఆయన మెడ తెంపేసేదే. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలి. కానీ చైనా మాంజా కొన్ని కుటుంబాల్లో చీకటిని నింపడం గ్యారంటీగా కనిపిస్తున్నది. ఈ ప్రమాదకర మాంజాను నిషేదించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు అమ్మే దుకాణాదారులనే కాదు.. దీన్ని పతంగికి కట్టి ఎగిరేసే వాళ్ల మీద కూడా కేసులు పెట్టాలి. మనుషులనే కాదు.. ఇతర జీవరాశికీ ప్రమాదకారిగా మారిన దీన్ని ఉపయోగించడానికి సాహసించే ప్రతి ఒక్కరినీ చట్టరీత్యా శిక్షించాల్సిందే. ఆఖరికి ఎవరి షాపులో కనిపించినా, ఎక్కడైనా నిల్వ చేసినట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వడం పౌర సమాజం బాధ్యత.
-శిరందాస్ ప్రవీణ్‌కుమార్,
జర్నలిస్టు






